Moviesవిరాట్ కోహ్లీ.. ఈ హీరోయిన్ కి ఏం అవుతాడో తెలుసా..? వెరీ...

విరాట్ కోహ్లీ.. ఈ హీరోయిన్ కి ఏం అవుతాడో తెలుసా..? వెరీ వెరీ స్పెషల్ రిలేషన్ షిప్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ రుహాని శర్మకు విరాట్ కోహ్లీ బావ అవుతాడా..? అంటే అవును అని అంటున్నారు జనాలు . హీరోయిన్ రుహాని శర్మ తమిళ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి
వచ్చి తెలుగులో చీ లా సౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది .

అడపాదడపా వేరే భాషల్లో కూడా కనిపించింది . కానీ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేదు . ఈ సంక్రాంతికి తెలుగులో సైంధవ్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సైంధవ్ సినిమాలో రుహాని శర్మ ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది . కాగా రీసెంట్ గా రుహానిశర్మ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కు వెళ్ళగా అక్కడ ఆమె మీడియాతో ముచ్చటించింది .

“ఈ క్రమంలోనే వెంకటేష్ గారిని చాలా సినిమాల్లో చూసానని.. ఆయనతో స్క్రీన్ షాట్ చేసుకోవడం చాలా బాగుందని చెప్పిన ఆమె ..డాక్టర్ అవ్వాలి అనుకున్నానని ఇప్పుడు తన డ్రీమ్ మారిపోయింది అని చెప్పుకొచ్చింది “. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మీకు సిస్టర్ అవుతుందా..? విరాట్ బావ అవుతాడా..? అని అడగ్గా..” అవును ఇది సీక్రెట్ .. నా పర్సనల్ నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు ..మరి నీకు ఎలా తెలుసు ..? అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది . విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు ..చాలా మంచివాడు నాతో బాగా ఉంటాడు ..వాళ్ళు అందరితో చాలా మంచిగా ఉంటారు ..ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఉంటారు” అంటూ రుహాని శర్మ చెప్పుకొచ్చింది .దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news