Newsత్రిష, అనుష్కతో పెదవులపైన, శ్రీలీలతో బుగ్గపైన ఆ స్టార్ డైరెక్ట‌ర్‌కు ఇంత...

త్రిష, అనుష్కతో పెదవులపైన, శ్రీలీలతో బుగ్గపైన ఆ స్టార్ డైరెక్ట‌ర్‌కు ఇంత ముద్దుల పిచ్చా…!

త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటల్లో తూటాలుంటాయి. వాటితో సంచుల కొద్దీ పంచులు పేలుస్తుంటాడు. కథ, కథనాలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ లో మాసివ్ నెస్ ఉంటుంది క్లాసీనెస్ ఉంటుంది. ఓవరాల్ గా ఓ స్టార్ హీరోను తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించగల సత్తా ఉంటుంది. అత్తారింటికి దారేది లాంటి కాస్ట్లీ కథలను చెప్పగలడు.

అతడు లాంటి ఫ్యామిలీ డ్రామాను చూపించగలడు. అరవింద సమేత లాంటి ఫ్యాక్షన్ కథను అదే లెవల్ లో చూపించగలడు. అల వైకుంఠపురం లాంటి కాపీ కథతోనూ మెప్పిస్తాడు. కథలో కాపీ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయని కామెంట్స్ ప్రతీసారి వినిపించినా త్రివిక్రం మాత్రం వాటిని పక్కన పెట్టేస్తారు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ ని ఎంత గ్లామర్ గా చూపించాలో అంత హోంలీగా కూడా చూపిస్తాడు.

బాస్ కాళ్ళు చూసి చొంగ కార్చుకునే హీరో ఎలా ఉంటాడో చెప్పగల సత్తా ఉన్నవాడు. ఏది ఎమైనా హీరోయిన్ తో మాత్రం హీరోకి ముద్దు పెట్టే సీన్స్ మాత్రం బాగా రాస్తాడు. అతడు సినిమాలో త్రిష మహేశ్ బాబు పెదవిపైన ముద్దు పెడుతుంది. ఖలేజా సినిమాలోనూ అనుష్క శెట్టి మహేశ్ పెదాలపైనే ముద్దు పెడుతుంది. ఈ సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి.

ఇప్పుడు అదే మహేశ్ బాబు బుగ్గపైన కుర్రభామ శ్రీలీల ముద్దు పెట్టే పోస్టర్ ఒకటి రిలీజైంది. ఇది చూసి మహేశ్ కి ముద్దు పెట్టించేంత వరకు త్రివిక్రం నిద్రపోడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, త్రివిక్రం లో మంచి రొమాంటిక్ పర్సన్ ఉన్నాడని..ముఖ్యంగా ముద్దులంటే బాగా క్రేజ్ అని చెప్పుకుంటున్నారు. చిత్రీకరణ సమయంలో ఎలా ఎంజాయ్ చేస్తాడో అని మాట్లాడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news