Newsఎన్టీఆర్ 31 మూవీ స్టోరీ లైన్ ఇదే... ప్ర‌శాంత్ నీల్ లీక్...

ఎన్టీఆర్ 31 మూవీ స్టోరీ లైన్ ఇదే… ప్ర‌శాంత్ నీల్ లీక్ చేసేశాడుగా…!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా దేవరలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. విలన్ గా మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించునున్నారు. అలాగే మరో బాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది. తొలిభాగం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో పాటు త్వరలో హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచి వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ డేట్లు కేటాయించనున్నాడు. హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ ప్రాజెక్టు అంటే దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ? అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. వార్ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ అందించారు.

తారక్ తో కలిసి పని చేయడం కోసం తాను ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నానని.. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని.. విభిన్న కాన్సెప్ట్ తో పాటు, విభిన్న భావోద్వేగాలతో కూడిన కథను తాను ఈ సినిమా కోసం రెడీ చేసినట్టు తెలిపారు. అయితే ఈ మూవీ యొక్క జానర్ ని తాను ఇప్పుడే బయటకు చెప్పలేనని.. ఒకవేళ ఇది ముందే చెప్తే ఇది యాక్షన్ సినిమాగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని నీల్‌ తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా పేరు హీరోయిన్గా పరిశీలనలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news