Moviesఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా అఫీషియల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఫ్యాన్స్...

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా అఫీషియల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఫ్యాన్స్ కి ఊహించిన సర్ప్రైజ్..!

నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త డే.. కచ్చితంగా ఈరోజు నందమూరి అభిమానులు ఎంత హంగామా చేస్తారో అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళు హీరోలా కాకుండా ఒక అన్నలా ఫీలవుతూ ఉంటారు . ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా ఎన్టీఆర్ తన బర్త్డ డేను ఫారిన్ కంట్రీస్ లో జరుపుకుంటున్నారు . కుటుంబ సభ్యులతో తన పుట్టినరోజును చాలా చాలా స్పెషల్ గా జరుపుకుంటున్నారు . ఇదే మూమెంట్లో ఆయన నెక్స్ట్ నటించబోతున్న సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు మేకర్స్.

కొద్ది గంటల క్రితమే కొరటాల శివ ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా దేవర సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు . అయితే ఆ ఊపు తగ్గక ముందే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను అనౌన్స్ చేశారు అంటూ ప్రచారం జరిగింది . అంతేకాదు ఆ టైటిల్ లోగోనే రివిల్ చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. లాస్ట్ మినిట్ లో ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ డ్రాగన్ కి సంబంధించిన లుక్స్ ఏవి రివిల్ చేయకుండా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే అప్డేట్ ఇచ్చారు .

ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలు పెట్టబోతున్నారట . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అలాగే ఇది పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ హైపిచ్చారు . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం . దేవర షూటింగ్ అవ్వగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని సెట్స్ పై కి తీసుకురాబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ అప్డేట్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. అఫ్కోర్స్ డ్రాగన్ లోగో రిలీజ్ చేయకపోయినా సరే క్రేజీ అప్డేట్ ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news