Moviesదేవర "ఫియర్ సాంగ్" లో ఈ తప్పులు గమనించారా.. బిగ్ మిస్టేక్...

దేవర “ఫియర్ సాంగ్” లో ఈ తప్పులు గమనించారా.. బిగ్ మిస్టేక్ చేశావ్ కొరటాల(వీడియో)..!

కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన దేవర సినిమా నుంచి ఫియర్ సాంగ్ వచ్చేసింది . మనకు తెలిసిందే. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాకి సంబంధించిన సాంగ్ రిలీజ్ చేస్తాము అంటూ ముందే ప్రకటించారు . అనుకున్న విధంగానే ఆ సాంగ్ రిలీజ్ చేశారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు . ఏకకాలంలో తెలుగు – తమిళ – కన్నడ – హిందీ – మలయాళ భాషల్లో ఈ పాటను వదిలారు .

కాగా అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న మరో వర్గం ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది . జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఊర నాటు మాస్ సాంగ్ అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు . కానీ ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళ సాంగ్ లా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు . ఫియర్ సాంగ్ అంటూ మమ్మల్ని ఫియర్ చేసేసారే అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ రౌడీలను నరుకుతూ రక్తం వచ్చేలా బాగా కృయాలిటీ సీన్స్ ఈ పాటలో చూపించారు.

ఏకంగా ఎన్టీఆర్ కోతకు సముద్రమంతా రక్తపు మడుగు లాగా కనిపిస్తుంది. ఈ సాంగ్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . దేవర ఫుల్ మూవీ చూస్తే ఫీవర్ రావాల్సిందే అంటూ కొందరు అంటుంటే కొరటాల శివ పెద్ద తప్పు చేశాడు అని ఈ పాట ఇంగ్లీష్ వాళ్ళలా పాటలా ఉంది అని .. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకొని ఉంటే కచ్చితంగా ఆయన రాసుకున్న కథకు వాళ్లు న్యాయం చేసే వాళ్ళు అని అనిరుధ్..మ్యూజిక్ బాగున్న తెలుగు జనాల బుర్రకి ఎక్కుతుంది అన్న నమ్మకాలు లేవు అని చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇవే కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news