Moviesప్రభాస్ తో సలార్ సినిమా ఆఫ్ట్రాల్ .. ఎన్టీఆర్ తో సినిమా...

ప్రభాస్ తో సలార్ సినిమా ఆఫ్ట్రాల్ .. ఎన్టీఆర్ తో సినిమా మాత్రం అరాచకానికి అమ్మ మొగుడే.. మెంటల్ ఎక్కించే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

ఎస్.. ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు నందమూరి ఫ్యాన్స్ . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది . అదే సలార్. ప్రభాస్ నటించిన సలార్ సినిమా నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . మొదటి షో తోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకునింది. మరీ ముఖ్యంగా సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా అందరికల్లు ప్రభాస్ వైపే చూశాయి అంటే ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అన్న విషయం అర్థం చేసుకోవచ్చు .

అయితే ప్రభాస్ సలార్ సినిమా చూసిన నందమూరి ఫ్యాన్స్ ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగుడుతూనే .. త్వరలోనే తెరకెక్కే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది . బాడీలో అంత పెద్ద మాస్ ఎలివేషన్స్ కూడా చూపించలేకపోయాడు . అదే ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ కథలో ఎన్టీఆర్ కనిపిస్తే ఖచ్చితంగా మరో “ఆది” సినిమా అవుతుంది అని ..సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాయిబోతున్నాడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

ఏమాటకు ఆ మాటే నందమూరి ఫ్యాన్స్ చెప్పిన మాటల్లో నిజం ఉంది. సలార్ సినిమా ఓకే .. కేజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యాక అలాంటి సినిమాను మించి మరో సినిమా తీయలేరు అనుకున్నారు. కానీ సలార్ వచ్చింది. ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే అంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ 31 సినిమా వస్తుందిగా అప్పుడు అసలైన సత్తా ఏంటో తెలుస్తుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news