Moviesప‌వ‌న్ డైరెక్ట‌ర్‌తో మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఫిక్స్‌... ఊహించ‌ని కాంబినేష‌న్‌...!

ప‌వ‌న్ డైరెక్ట‌ర్‌తో మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఫిక్స్‌… ఊహించ‌ని కాంబినేష‌న్‌…!

నందమూరి నట‌సింహమ‌ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై నాలుగైదు సంవత్సరాలుగా నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ నటిస్తాడని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞ సినిమా కోసం ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో పాటు డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

బాలయ్య తన కుమారుడిని 2024 లో టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
రీసెంట్‌గా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్‌ నడిచింది. పైగా త్రివిక్రమ్‌తో స్క్రిప్ట్ గురించి బాలయ్య‌ డిస్కషన్లు కూడా చేశాడని అన్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిని సూపర్ డూపర్ హిట్ చేసిన క్రిష్ పేరు వినిపిస్తోంది. క్రిష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే మే తర్వాత కూడా మరో రెండు సినిమాలు పూర్తయ్యాకే హరిహర వీరమల్లుకు పవన్ డేట్లు ఇస్తారు. ఈలోగా మోక్షజ్ఞ సినిమా సెట్ కావడంతో ఆ సినిమాకు క్రిష్ డైరెక్టర్ అయితే బాగుంటుందని క్లాస్ టచ్ కూడా ఉంటుందని బాలయ్య భావిస్తున్నాడట. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు క్రిష్ డైరెక్టర్ అన్నది దాదాపు ఫిక్స్ అయినట్టు బాగా వైరల్ అవుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news