Moviesఎర్ర కోకలో కేక పెట్టిస్తున్న శ్రీలీల.. మహేశ్ ఊర నాటు మాస్...

ఎర్ర కోకలో కేక పెట్టిస్తున్న శ్రీలీల.. మహేశ్ ఊర నాటు మాస్ స్టెప్పులు.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది..!!

గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ క్లోజ్ చేస్తున్న విషయం తెలిసిందే . ఫ్యాన్స్ కి అప్ టు ద మార్క్ లా అప్డేట్స్ కనిపించలేదు . ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కూడా నెక్స్ట్ అప్డేట్ పై చాలా కాన్సన్ట్రేషన్ చేశాడు . అందుకే అది ఇది కాదు ఏకంగా సినిమాలోని స్పైసి హై వోల్టేజి సాంగ్ ని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చాడు .

సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేయబోతున్నాం అంటూ యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది . అయితే ఎప్పటిలా క్లాస్ మాస్ కాకుండా ఈసారి ఊరనాటు మాస్ స్పైసీ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్ రిలీజ్ చేశారు . “ఈసారి రాబోయే సాంగ్ వూఫర్స్ బద్ధలైపోవాల్సిందే.. సిద్ధంగా ఉండండి హై వోల్టేజ్ తో కూడిన స్పైసీ మాస్ హాట్ కలగలిపిన సాంగ్ రాబోతుంది ” అంటూ హామీ ఇచ్చారు.

అంతేకాదు క్రేజీ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు . ఈ పోస్టర్లో మహేష్ బాబు మాస్ స్టెప్స్ తో శ్రీ లీల ఎర్ర చీర నల్ల జాకెట్ తో అద్దిరిపోయే మాస్ లుక్ లో కనిపించింది . వీళ్లిద్దరూ స్టెప్స్ చూస్తుంటే ఈ పాట రచ్చ రంబోలా చేయడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. జనవరి 12వ తేదీ 2024లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు . మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news