Newsఈ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు.....

ఈ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలిస్తే పడి పడి నవ్వుతారు.. భలే విచిత్రంగా ఉన్నాయే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ ఒరిజినల్ పేర్లు కన్నా తమ డూప్లికేట్ పేర్లతోనే పాపులారిటీ దక్కించుకున్నారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ పేర్లను మార్చుకున్నాకే వాళ్ళకిలా కలిసి రావడం గమనార్హం . అలాంటి హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

జయసుధా : ఈమె ఒరిజినల్ పేరు సుజాత . ఇండస్ట్రీలోకి వచ్చాక జయసుధగా మార్చుకునింది . ఆ తర్వాత ఆమెకు సూపర్ డూపర్ హిట్లు రావడమే కాకుండా స్టార్ హీరోయిన్గా ఆమె కెరియర్ మారిపోయింది.

జయప్రద : ఈమె ఒరిజినల్ పేరు లలిత రాణి . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక జయప్రదగా పేరు మార్చుకొని తన పేరుని మరింత మారుమ్రోగి పోయేలా చేసుకునింది. అంతేకాదు ఒకానొక దశలో స్టార్ హీరోలకి మించిన పారితోషకం అందుకుంది.

శ్రీదేవి: అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న ఈమె ఒరిజినల్ పేరు శ్రీ అమ్మ అయ్యంగార్. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక శ్రీదేవిగా పేరు మార్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

సౌందర్య : అందరికీ ఎంతో ఫేవరెట్ హీరోయిన్ అయినా సౌందర్య అసలు పేరు సౌమ్య . ఇండస్ట్రీలోకి రాకముందే సౌందర్యగా పేరు మార్చుకునింది . ఆ తర్వాత అదే పేరుతో కంటిన్యూ అవుతూ తన లక్ ని ముందుకు తీసుకెళ్లింది . అయితే చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది .

రోజా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రోజా పొలిటికల్ పరంగా ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటుంది. అయితే ఈమె ఒరిజినల్ పేరు శ్రీలత రెడ్డి . ఇండస్ట్రీలో కి వచ్చాక రోజాగా తన పేరు మార్చుకుంది . ఇప్పటికీ రోజా పేరు చెప్తే గజగజ వణికి పోయే హీరోలు చాలామంది ఉన్నారు.

రంభ : తన నడుము అందాలతో ఆకట్టుకునే రంభ అసలు పేరు విజయలక్ష్మి . ఇండస్ట్రీలోకి రాకముందే రంభ పేరు మార్చుకుంది. ఆ పేరుతోనే పాపులారిటీ దక్కించుకున్నింది. ఇండస్ట్రీని ఏలేసింది.

రాశి: ఈమె ఒరిజినల్ పేరు మంత్ర . ఇండస్ట్రీలోకి రాకముందే రాశిగా పేరు మార్చుకున్నింది.

అనుష్క : స్వీటీ శెట్టి ఇండస్ట్రీలోకి రాకముందే అనుష్క శెట్టిగా పేరు మార్చుకుంది .

నయనతార : డయానా మరియు కొరియన్.. ఇండస్ట్రీలోకి రాకముందే నయనతారగా పేరు మార్చుకొని ఇండస్ట్రీని ఏలేస్తుంది.

భూమిక : ఈమె ఓరిగినల్ పేరు రచనా చావ్లా ఇండస్ట్రీలోకి రాకముందే ఈమె భూమికగా పేరు మార్చుకున్నింది.

స్నేహ : ఈమె ఓరిజినల్ నేమ్ సుహాసిని నాయుడు . ఇండస్ట్రీలోకి రావడానికి ముందు స్నేహగ పేరు మార్చుకునింది .

శృతి హాసన్ : ఈమె ఒరిజినల్ పేరు రాజ్యలక్ష్మి హాసన్, అయితే ఇండస్ట్రీలోకి వచ్చే ముందు శృతిహాసన్ గా పేరు మార్చుకున్నింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news