Moviesకూతురు ఐశ్వ‌ర్య పెళ్లికి ప్ర‌భు ఇచ్చిన క‌ట్నం తెలుసా... భ‌ర్త కంటే...

కూతురు ఐశ్వ‌ర్య పెళ్లికి ప్ర‌భు ఇచ్చిన క‌ట్నం తెలుసా… భ‌ర్త కంటే ఆమె అంత పెద్ద‌దా…!

సౌత్ ఇండియాలో త‌మిళ సీనియ‌ర్ హీరో ప్ర‌భుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా ప్ర‌భు కూతురు ఐశ్వ‌ర్య‌కు రెండో వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ సినిమా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అధిక్ ర‌విచంద్ర‌న్‌తో ఐశ్వ‌ర్య వివాహం జ‌రిగింది. ఆమెకు ఇది రెండో వివాహం. అంత‌కు ముందే ఆమెకు త‌న సొంత మేన‌బావ‌తో వివాహం జ‌రిగింది.

ప్ర‌భు సోద‌రి తేన్‌మొళి కుమారుడు కునాల్‌తో ఆమెకు వివాహం జ‌రిగింది. ఈ జంట లండ‌న్‌లో స్థిర‌ప‌డ్డారు. అయితే కొన్నాళ్ల‌కే వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడాకులు తీసుకున్నారు. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేశాక ఐశ్వ‌ర్య చెన్నైకు వ‌చ్చేసి కూడా చాలా యేళ్లు అయ్యింది. ఇండియాకు వ‌చ్చాక ఆమె కేక్‌లు త‌యారీ బిజినెస్‌లో ఉంది.

ఈ క్ర‌మంలోనే త‌న పాత స్నేహితుడు అయిన ద‌ర్శ‌కుడు అధిక్‌తో ఆమెకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వ‌య‌స్సులో ఐశ్వ‌ర్య కంటే అధిక్ రెండేళ్లు చిన్న‌వాడు. ఆమె వ‌య‌స్సు 34 అయితే అధిక్ వ‌య‌స్సు 32. ఇక త‌న కూతురుకు క‌ట్నంగా ప్ర‌భు ల‌క్ష‌లాది రూపాయ‌ల ఆస్తులు ఇచ్చాడు.

చెన్నై న‌డిబొడ్డున విలాస‌వంత‌మైన బంగ్లాతో పాటు కోటి రూపాయ‌ల న‌గ‌దు, ల‌క్ష‌లాది విలువైన బంగారు, వ‌జ్రం ఆభ‌ర‌ణాలు ఇచ్చాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news