Newsబాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వ‌చ్చి.. ఇక్క‌డ హీరోతో డేటింగ్‌... ఇంకేం బాగుప‌డుతుంది...!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వ‌చ్చి.. ఇక్క‌డ హీరోతో డేటింగ్‌… ఇంకేం బాగుప‌డుతుంది…!

అదితిరావు హైదరీ..పక్కా హైదరాబాదీ. కానీ, సినిమాల కోసం చెన్నై, ముంబై లలో ఎక్కువగా ఉంటోంది. పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అదితీ రావు హైదరీ మలయాళ ఇండస్ట్రీలో ప్రజాపతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో రాక్ స్టార్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి హిందీలో బాగా పాపులర్ అయింది.

సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన భూమి సినిమా అదితిరావు హైదరీ కి చాలామంది పేరు తెచ్చిపెట్టింది. అలా బాలీవుడ్ లో పాపులర్ అయిన అదితిరావు హైదరీ తెలుగులో కూడా అవకాశం అందుకుంది. ఇక్కడ సమ్మోహనం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా అదితిరావు హైదరీకి మంచి పేరొచ్చింది.

హీరోయిన్ నచ్చితే వరుసగా ఆయన సినిమాలలో రెండు మూడుసార్లు ఛాన్స్ ఇచ్చే ఇంద్రగంటి ఆ తర్వాత వి సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు. ఇందులోనూ మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అంతరిక్షం, మహా సముద్రం లాంటి సినిమాలు పర్ఫార్మెన్స్ పరంగా అదితికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి. కానీ, కొంపముంచిందల్లా మహాసముద్రం సినిమానే. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే మాయగాడు సిద్దార్థ్ తో రిలేషన్ మొదలైంది.

ఆయన చాలామంది హీరోయిన్స్ తో రిలేషన్ మేయింటైన్ చేసి పక్కన పడేస్తుంటాడని టాక్ ఉంది. వీరిలో సమంత కూడా ఉంది. ఆ తర్వాత మరికొందరు హీరోయిన్స్ సిద్దార్థ వల్ల దెబ్బతిన్నారు. ఆ లిస్ట్ లో అదితీ రావు హైదరీ కూడా చేరింది. ఇప్పుడు ఆమె సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమలో ఉందట. మైండ్ లో నుంచి అది తీసేసి బాలీవుడ్ సినిమాల మీద దృష్టి పెడితే కెరీర్ బావుంటుందని సన్నిహితులు సలహాలిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news