Newsపాపం ఆనంద్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చి సైడ్ అయిపోయిన వైష్ణవి.. తేడా...

పాపం ఆనంద్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చి సైడ్ అయిపోయిన వైష్ణవి.. తేడా ఎక్కడ కొట్టిందంట్టే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ – వైష్ణవి జంటగా నటించిన సినిమా బేబీ. ముక్కోణపు ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు. యూత్ ను పిచ్చపిచ్చగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. పిఆర్ఓగా, జర్నలిస్టుగా పనిచేసిన ఎస్‌.కే.యన్‌ ఈ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారి అదిరిపోయే లాభాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక ఆనంద్ – వైష్ణవి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చేసింది.

ఈ క్రమంలోనే కొందరు దర్శక నిర్మాతలు కూడా ఈ జోడిని రిపీట్ చేసి కాంబినేషన్ సొమ్ము చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మిధున్ అనే కొత్త దర్శకుడు వీరిద్దరి కాంబినేషన్‌లో డ్యూయెట్ అనే టైటిల్ తో ఒక సినిమా ప్లాన్ చేశారు. ముందుగా వైష్ణవి ఓకే చెప్పింది. తర్వాత ఏం జరిగిందో కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో కొత్త హీరోయిన్ వచ్చి చేరింది. నిర్మాతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైష్ణవి ఒప్పుకోలేదు.

అసలు కథ ఏంటంటే.. బేబీ నిర్మాత ఎస్కేయన్‌తో పాటు గీత ఆర్ట్స్ బ్యానర్లో మూడు సినిమాలలో నటించేందుకు వైష్ణవి ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకుంది. ఆ మూడు సినిమాలు పూర్తి అయితే గాని ఆమె బయట బ్యానర్లలో సినిమాలు చేయడానికి వీలు లేదు. అలా మరోసారి బేబీ జోడిని వెండితెర మీద చూడాలనుకున్న వారి ఆశలకు బ్రేక్ పడినట్లు అయింది. ఇక ఈ సినిమాలో ఆనంద్‌కు జోడిగా రితిక నాయక్‌ని తీసుకున్నారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ కొట్టిన రితికకు ఇది ఇప్పుడు రెండో సినిమా. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news