News' స‌లార్ ' అప్పుడే 1.5 మిలియ‌న్లు... ఇదెక్క‌డి మాస్ ర్యాంపేజ్...

‘ స‌లార్ ‘ అప్పుడే 1.5 మిలియ‌న్లు… ఇదెక్క‌డి మాస్ ర్యాంపేజ్ రా సామి..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా.. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ స‌లార్‌. కేజిఎఫ్ సిరీస్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్‌ పేరు దేశవ్యాప్తంగా ఎలా మరుమోగిపోతుందో ? చూస్తూనే ఉన్నాం. ఇటు బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ పై డైనోసార్ గా గర్జిస్తుందని అందరూ చెబుతున్నారు.

ఈ ఒక్క పదాన్ని బట్టి స‌లార్ పై అంచనాలు కానీ విని ఎరుగని రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సలార్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 కు వాయిదా పడుతుంది. ఇప్పటివరకు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చిన ప్రభాస్.. ఇండియాకు రిటర్న్ కావడంతో సలార్ వైబ్స్‌ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ ఓవర్సీస్ రిలీజ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

సలార్ ఓవర్సీస్ బుకింగ్స్ యూఎస్‌లో భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్‌కి ఎప్పుడో రెండు నెలల ముందే 7 లక్షల డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు బుకింగ్స్ మళ్లీ కొన్ని లొకేషన్‌లో స్టార్ట్ కాగా శర‌వేగంగా అడ్వాన్స్ బుకింగ్‌లు జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. బుకింగ్ అలా స్టార్ట్ అయ్యాయో లేదో సలార్ మళ్ళీ మాస్ ర్యాంపేజ్ స్టార్ట్ చేసిందని చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమాకు 1.5 మిలియన్ డాలర్ల వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు నెల రోజులకు పైగా టైం ఉండడంతో రిలీజ్ టైంకు కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఇతర దేశాల్లోనూ సలార్ మానియా మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news