News"దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదేనా..?".. రష్మిక...

“దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదేనా..?”.. రష్మిక డీప్ ఫేక్ వీడియో పై విజయ్ స్పందన ఇదే..!!

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఒకప్పుడు సినిమాల గురించి ఆమె పేరు మారుమ్రోగి పోయేది. కానీ ఈసారి మాత్రం ఓ వల్గర్ వీడియో కారణంగా ఆమె పేరు నెట్టీంట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది . వేరే ఎవరో అమ్మాయికి సంబంధించిన డీప్ వల్గర్ ఫేక్ వీడియోలో రష్మిక ఫేస్ ను మార్క్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కొందరు ఆకతాయిలు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. దీనిపై పలువురు స్టార్స్ స్పందించి ఆమెకు సపోర్ట్ గా నిలిచారు . ఈ క్రమంలోనే గవర్నమెంట్ కూడా అలాంటి మార్ఫ్ వీడియో చేసే వాళ్ళపై కఠిన యాక్షన్స్ తీసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యింది. కాగా దీనిపై రీసెంట్ గా విజయ్ దేవరకొండ స్పందించాడు. రష్మిక బాయ్ ఫ్రెండ్ అంటూ జనాలు చెప్పుకునే విజయ్ దేవరకొండ రష్మిక డీప్ ఫేక్ వీడియో పై ఇన్స్టాల్ లో ఓ స్టోరీ రాసుకోచ్చాడు.

“ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే సైబర్ డిపార్ట్మెంట్లో ఇలాంటివి త్వరగా అరికట్టేలా ..వాటికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించేలా చట్టం తీసుకురావాలి “అంటూ చెప్పుకొచ్చాడు . విజయ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది . అయితే గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో రష్మిక మందన్నా పై వార్తలు వినిపిస్తూ ఉంటే ఆమె క్లోజ్ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్.. కాబోయే భర్త అయిన నువ్వు ఇంత లేటుగా స్పందిస్తే ఎలా అంటూ కొందరు కావాలనే ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు విజయ్ దేవరకొండను కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

నిజానికి విజయ్ చేసిన దాంతో తప్పులేదు . ఆయన ఓ పెద్ద యాక్టర్.. బిజీబిజీగా ఉంటాడు .సోషల్ మీడియా కే అంకితమయ్యే క్యారెక్టర్ కాదు విజయ్ ది .. మరి అలాంటి ఆయనకు ఈ న్యూస్ లేటుగా రీచ్ అయ్యి ఉండొచ్చు.. వార్త తెలిసిన వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దీనిలో తప్పేముంది .. పనీపాటా లేని వాళ్ళు విజయ్ దేవరకొండ టార్గెట్ చేయడం కన్నా ఇలాంటి ఫేక్ వీడియోలు మార్ఫ్ వీడియోలు చేయొద్దు అంటూ పలువురికి సజెషన్స్ ఇస్తే ఇంకా మంచిది అంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . మొత్తానికి లేటుగా పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాని షేక్ చేసేసాడు మన రౌడీ హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news