News"కోట్లాది మంది మగాళ్లు .. కేవలం ఒంటి పై టవల్ మాత్రమే".....

“కోట్లాది మంది మగాళ్లు .. కేవలం ఒంటి పై టవల్ మాత్రమే”.. కత్రీన భర్త విక్కి ఫీలింగ్ ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కత్రినా కైఫ్ తాజాగా నటించిన సినిమా టైగర్ 3 . సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . భారీ వసూళ్లతో బాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది . ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ పేర్లు మరోసారి వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ యాక్ట్ చేసిన టవల్ ఫైట్ అభిమానులను బాగా ఆకట్టుకునింది.

సినిమాలో సల్మాన్ ఖాన్ ఎన్ని స్టాంట్స్ చేసినా కత్రినా టవల్ ఫైట్ మాత్రమే హైలెట్ అయింది . దీంతో బాలీవుడ్ స్టార్స్ ఎక్కడ కనిపించినా.. రిపోర్టర్స్ ఎక్కువగా టవల్ ఫైట్ గురించే ప్రశ్నిస్తున్నారు . ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ భర్త హీరో విక్కీ కౌశల్ తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన భార్య నటించిన టైగర్ 3 సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

“కత్రినా టవల్ ఫైట్ చూసి షాక్ అయిపోయానని ..మైండ్ బ్లాక్ అయిందని .. వెంటనే తనకి ఒక విషయం చెప్పానని .. టవల్ ఫైట్ మాత్రం నాపై ఉపయోగించొద్దు అంటూ చెప్పేశానని కావాలంటే నీతో నేను ఏ విషయంలోనూ ఆర్గ్యు చెయ్యను .. నువ్వు చెప్పిందే చేస్తాను అంటూ క్లారిటీగా చెప్పేసానని చెప్పుకొచ్చాడు”. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన యాక్షన్ హీరోయిన్ నా భార్య కత్రినా అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . ఆమె పడిన కష్టానికి ఫలితం దక్కింది అని .. అది చూసి నేను గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు . దీంతో విక్కి కౌశల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news