Newsతార‌క్ - హృతిక్ ' వార్ 2 ' రిలీజ్ డేట్...

తార‌క్ – హృతిక్ ‘ వార్ 2 ‘ రిలీజ్ డేట్ ఫిక్స్‌…!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న మాసివ్ యాక్ష‌న్ డ్రామా వార్ 2 ఉంది. ఈ సెన్షేష‌న‌ల్ కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుంద‌ని అనౌన్స్ చేసిన‌ప్పుడే కేవ‌లం తెలుగు సినీ ప్రేక్ష‌కుల్లోనే కాకుండా నేష‌న‌ల్ వైడ్‌గా మామూలు క్రేజ్ రాలేదు.

బ్ర‌హ్మాస్త్ర ఫేం ఆయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమాలో న‌టిస్తున్నాడు. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే వార్ 2 కోసం ఎన్టీఆర్ కంటిన్యూగా కాల్షీట్లు ఇచ్చేస్తాడు.

ఇక వార్ సినిమా రిలీజ్ డేట్ కూడా అధికారికంగా క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. 2025 ఇండిపెండెన్స్ డే కానుక‌గా 2025, ఆగ‌స్టు 14న వార్ 2 సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నార‌ని ఫిక్స్ అయిపోయింది. సో అంటే వ‌చ్చే యేడాది కాకుండా.. ఆ పై వ‌చ్చే యేడాది వ‌ర‌కు కూడా వార్ 2 సినిమా కోసం వెయిట్ చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news