Newsమ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో మెగాస్టార్‌... రెండో హీరో ఎవ‌రంటే...!

మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో మెగాస్టార్‌… రెండో హీరో ఎవ‌రంటే…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వ‌రుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గ‌తేడాది ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టారు. ఇక ఆగ‌స్టులో భోళాశంక‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి డిజాస్ట‌ర్‌తో నిరాశ ప‌రిచాడు. ఇక ఇటీవ‌ల కాలంలో చిరు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తున్నారు.

రీ ఎంట్రీ త‌ర్వాత త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో ఆచార్య చేశాడు. ఇక వాల్తేరు వీర‌య్య‌తో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో క‌లిసి న‌టించాడు. ఇక ఇప్పుడు మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో చిరు న‌టించే ఛాన్సులు ఉన్నాయి. చిరుతో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే ఆ రెండో హీరో ఎవ‌రో ? కాదు మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. సాయిధ‌ర‌మ్ ఇటీవ‌ల విరూపాక్ష‌, బ్రో సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక విరూపాక్ష సూప‌ర్ హిట్‌. బ్రోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ అయ్యింది. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సంపత్ నంది తెరకెక్కించనున్న గాంజా శంకర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక సాయిధ‌ర‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 9 యేళ్లు పూర్త‌య్యింది. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్‌లో ఆస్కా సాయితేజ్ చాట్ సెష‌న్లో ప‌లువురు ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పాడు.

చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించారు కదా మరి పెద్ద‌మావ‌య్య‌ మెగాస్టార్ తో ఎప్పుడు నటిస్తార‌ని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు సాయితేజ్ తాను ఆ ఛాన్స్ కోస‌మే ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పాడు. అటు ప‌వ‌న్ – సాయి తేజ్ కాంబినేష‌న్ అయిపోయింది. ఇప్పుడు సాయితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు స‌రైన క‌థ‌, ద‌ర్శ‌కుడు ఉంటే చిరు మాత్రం ఎందుకు నో చెపుతారు.. వెంట‌నే ఓకే చెప్పేస్తారు. మ‌రి వీరి కాంబినేష‌న్ సినిమా కోసం వెయిట్ చేయ‌డ‌మే మిగిలిఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news