Newsస్కూల్ వయసులోనే రేర్ రికార్డ్ సాధించిన మెగా కోడలు పిల్ల.. అప్పుడే...

స్కూల్ వయసులోనే రేర్ రికార్డ్ సాధించిన మెగా కోడలు పిల్ల.. అప్పుడే దేవుడు రాసిపెట్టేశాడుగా..!!

లావణ్య త్రిపాథి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగి పోతుంది . అంతకుముందు లావణ్య త్రిపాఠి ని కూడా బాగా ఐడెంటిఫై చేసే వాళ్ళు . కానీ అది ఓ హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మగా.. కానీ ఇప్పుడు అందరూ ఈమెను మెగా కోడలుగా ముందు ట్యాగ్ చేసి మరీ ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్ గానే ఇటలీలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి మూడు రోజుల పాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబం.

హీరోయిన్ గా ఫ్లైట్ ఎక్కిన ఈమె మరికొద్ది గంటల్లోనే మెగా కోడలుగా హైదరాబాద్లో అడుగుపెట్టబోతుంది. ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాథికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15 1990లో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో పైజాబాత్ లో జన్మించింది . యూపీలో పుట్టిన డెహ్రాడూన్ లో విద్యాభ్యాసం కొనసాగించింది . గ్రాడ్యుయేషన్ కోసం ముంబై చేరుకున్న లావణ్య రామ్ నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్ పూర్తి చేసింది.

ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె 2012లో అందాల రాక్షసి సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు అందుకునింది. అయితే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ లో మార్షల్ స్కూల్లో విద్యను పూర్తి చేసిన లావణ్య త్రిపాఠి స్కూల్ ఏజ్ లోనే మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ని గెలుచుకుంది . ఇది నిజంగా ఒక రేర్ రికార్డు అనే చెప్పాలి . ఒకప్పుడు మిస్ ఉత్తరాఖండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మెగా కోడలుగా మరింత జనాలకు దగ్గరవుతుంది . కాగా వరుణ్ తేజ్ – లావణ్య జంటగా మిస్టర్ , అంతరిక్షం చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news