Moviesపెళ్లి చేసుకోబోతున్న జబర్ధస్త్ పవిత్ర.. అబ్బాయ్ ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

పెళ్లి చేసుకోబోతున్న జబర్ధస్త్ పవిత్ర.. అబ్బాయ్ ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు . రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . త్వరలోనే ఇండస్ట్రీలో ఉండే మరికొందరు స్టార్స్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వబోతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్గా పాపులారిటీ సంపాదించుకున్న పవిత్ర కూడా పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది.

తన ప్రియుడు సంతోష్ తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేసింది . సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..”నా జీవితంలో ఈ రోజు ఎంతో ఎంతో ప్రత్యేకం. లైఫ్ లో మర్చిపోలేనిది.. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నా సంతోష్ కి ఓకే చెప్పాను . అతనిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను.. మన లైఫ్ లో కొన్ని కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి”..

“అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి . మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి . సంతోష్ కి నేనంటే ఎంతో ఇష్టం .. నాపై లెక్కలేనంత ప్రేమ .. నాకోసం సమస్త కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది .. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను .ఎన్నో కష్ట సమయాలల్లో నాకు అండగా నిలబడ్డారు ..ఇకమీదట మనం కలిసి ప్రయాణిద్దాం ” అంటూ పోస్ట్ చేసింది . దీంతో జబర్దస్త్ పవిత్ర పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news