Movies"నాకు అస్సలు ఏం అర్ధం కావడం లేదు..ఇది వరమా..? లేక శాపమా..?"..కీర్తి...

“నాకు అస్సలు ఏం అర్ధం కావడం లేదు..ఇది వరమా..? లేక శాపమా..?”..కీర్తి సురేష్ బాధ మీకు అర్ధమవుతుందా..?

ప్రెసెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రష్మిక మందన్నా.. డీప్ ఫేక్ వీడియో పైనే మాట్లాడుకుంటున్నారు . స్టార్ సెలబ్రెటీస్ దగ్గర నుంచి ఇంట్లోని సామాన్య జనాల వరకు అందరికి ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ గా కనిపిస్తుంది . ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా రష్మిక మందన్నాకు సపోర్టుగా నిలుస్తూ ట్విట్స్ చేస్తున్నారు . ఇప్పటికే టాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎంతోమంది ప్రముఖులు రాజకీయ నేతలు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

తాజాగా కీర్తి సురేష్ సైతం రష్మిక మందన్నాకు మద్దతు తెలిపింది . ట్విట్టర్ వేదికగా ఆమె ట్వీట్ చేస్తూ “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో చూస్తుంటే చాలా చాలా భయమేస్తుంది ..ఇలాంటి చెత్త వీడియోలు క్రియేట్ చేసే అలవాటు ఎందుకు నేర్చుకున్నారో తెలియడం లేదు .ఆ టెక్నాలజీ విలువైన సమయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది ..?”

“ప్రస్తుతం టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది . అది మన వరమో లేక శాపమో అర్థం కావడం లేదు . ప్రేమను, మంచి పంచడం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగిద్దాం. అంతేకాని చెత్త పనుల కోసం కాదు అంటూ ట్వీట్ చేసింది “. దీనితో సోషల్ మీడియాలో రష్మిక మందన్నాకు కీర్తి సురేష్ సపోర్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news