ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . అభిమానులను ఆకట్టుకుంటున్నాడు . కాగా మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు బాగా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు రాజమౌళి . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు బ్రదర్ నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .
నరేష్ మాట్లాడుతూ..” ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని ..మా అమ్మ చేతి వంట తినేటప్పుడు చాలా బొద్దుగా కూడా ఉండేవాడిని ..వేడివేడి పొంగల్ లో ఎర్రటి కారంపొడి వేసుకుని తింటే భలే ఉంటుంది ..అయితే ఇప్పుడు డైట్ మార్చేశాను ..బాదంపప్పు ఎండుద్రాక్ష ఎండు ఖర్జూరం నానబెట్టుకొని ఆ నీళ్లను తాగుతున్నాను.. అదే నా బ్రేక్ ఫాస్ట్ చాలా బాగుంటుంది ..హెల్దీ కూడా అంటూ చెప్పుకొచ్చాడు”.
“అంతేకాదు కుటుంబమంతా కలిసి భోజనం చేసేటప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేది అని .. మా అమ్మ వండిన బిర్యాని మటన్ గోంగూర అంటే మహేష్ బాబుకి బాగా బాగా ఇష్టమని ..లాగించేసేవాడు అని చెప్పుకొచ్చాడు”. దీంతో మహేష్ బాబు కూడా ఇంత మంచి ఫుడీనా..? బయటకు అస్సలు కనిపించడే .. పలు ఇంటర్వ్యూలలో చాలా సింపుల్‌గా తన బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు నరేష్..!!