Newsఇది ప‌క్కా ఫిక్స్‌: దిల్ రాజు - బాల‌య్య సినిమాకు ఎన్టీఆర్...

ఇది ప‌క్కా ఫిక్స్‌: దిల్ రాజు – బాల‌య్య సినిమాకు ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ ఫిక్స్ …!

నట‌సింహం నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం పట్టిందల్లా బంగారం. ఒకప్పుడు బాలయ్య సినిమాలు కాంబినేషన్లో నిర్మాతలు వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు సరైన కాంబినేషన్.. కథ‌ అన్ని కుదిరితే తప్ప బాలయ్య సినిమాలు పట్టాలు ఎక్కించడం లేదు. అదే టైంలో చాలా స్పీడ్ గా సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. ఈ యాడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు సినిమాలతో సూపర్ హిట్లు కొట్టారు.

వెంటనే బాబి సినిమా మీదకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాలయ్యతో సినిమాలు చేయటానికి చాలామంది దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉన్నారు. అగ్ర‌ నిర్మాత దిల్ రాజు, మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇద్దరూ బాలయ్యతో సినిమా చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజుకు బాల‌య్య‌తో సినిమా చేయాలన్న కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియటం లేదు మధ్యలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా అనుకున్న కుదరలేదు.

అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి ని లైన్ లోకి తెచ్చినట్టు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి బాలయ్య కోసం ఒక మంచి కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి – దిల్ రాజు ఆస్థాన దర్శకుడు. పైగా దిల్ రాజుకు సమీప బంధువు. గతంలో ఎన్టీఆర్‌కు బృందావనం లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. ఇక వంశీ చివరిసారిగా మహేష్ బాబుతో తెర‌కెక్కించిన‌ మహర్షి, ఆ తర్వాత తమిళ హీరో విజయ్‌తో వారసుడు సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఇప్పుడు బాలయ్య కోసం అదిరిపోయే యాక్షన్ స్టోరీ రెడీ చేసినట్టు తెలుస్తోంది.

ఇక అటు అల్లు అరవింద్ కూడా బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బాలయ్యకు నచ్చిన దర్శకుడు బోయపాటి డేట్లు అరవింద్ దగ్గరే ఉన్నాయి. సో అక్కడ అల్లు అరవింద్, బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సెట్ అవటం పెద్ద కష్టం కాదు. ఏది ఏమైనా బాలయ్యతో ఇటు దర్శ‌కులు.. అటు నిర్మాత లైనప్‌ మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news