Newsఅనుష్క‌ను ఆ ప‌ని కోసం లైన్లో పెడుతోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌...!

అనుష్క‌ను ఆ ప‌ని కోసం లైన్లో పెడుతోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌…!

టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వెండితెరపై కనిపించింది. వయసులో తనకంటే చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టికి జంటగా అనుష్క నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్‌ అందుకున్న అనుష్క తన ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. అనుష్కకు ఇంకా పెళ్లి కాలేదు.. దీంతో స్వీటీ నుంచి వచ్చే నెక్ట్స్‌ ప్రాజెక్ట్ ఏంటన్న ? దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి ఉంది.

లేటెస్ట్‌గా అనుష్క తర్వాత సినిమాలపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్‌ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాలో అనుష్కను ఓ హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో అనుష్క – చిరంజీవి కలిసి స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు మళ్ళీ అనుష్క ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించబోతుందని తెలుస్తోంది.

టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు అనుష్క‌తో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు డిస్కషన్‌లు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ కథ కూడా అనుష్కకు బాగా నచ్చినట్టు సమాచారం. అన్నీ సెట్ అయితే మళ్లీ అరుంధతి, పంచాక్షరి సినిమాల తర్వాత ఓ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలో అనుష్క కనిపించబోతుందని చెప్పాలి. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news