Newsరెండో పెళ్లి - ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్‌పై సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన రేణుదేశాయ్‌..

రెండో పెళ్లి – ఎంగేజ్మెంట్ బ్రేక‌ప్‌పై సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన రేణుదేశాయ్‌..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్ రెండేళ్ల క్రితం రెండో పెళ్ళికి సిద్ధమయింది. పవన్ కు విడాకులు ఇచ్చేశాక తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్న ఆమె రెండో పెళ్లి కోసం ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మూడు ముళ్ళు మెడలో పడటం ఆలస్యం అనుకుంటున్న తరుణంలో రేణు ఏకంగా రెండో పెళ్లి రద్దు చేసుకొని షాక్ ఇచ్చింది. తాను రెండో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటానికి కారణాలు ఏమిటో తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్లలో చెప్పింది.

నా వ్యక్తిగత విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నానని నా గురించి ఎవరు తప్పు పట్టకూడదనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నానని రేణు తెలిపింది. కుటుంబ సభ్యులు.. సన్నిహితుల అంగీకరణతోనే తన ఎంగేజ్మెంట్ జరిగింది.. కానీ పిల్లలు ఉన్నారు.. వాళ్లకు తోడుగా ఉండాలి నువ్వు ఎలా ఉంటావు ? అది ఇది అని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రకరకాల ప్రశ్నలు వేశారు. అప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేశాను.. అప్పుడు నా కూతురు వయసు 7 సంవత్సరాలు మాత్రమే.. కూతురు కోసమే తాను పెళ్లి రద్దు చేసుకున్నానని రేణు తెలిపింది.

నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే… అతనికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది.. నా కూతురు చాలా చిన్న పిల్ల కదా ? ఆమెను చూసుకోవటానికి తండ్రి కూడా లేడు.. తల్లినైన నేను వేరే వ్య‌క్తితో వెళ్ళిపోతే తన కుమార్తె ఏం కావాలి ? అని రకరకాలుగా ఆలోచించాను.. ఇప్పుడు పెళ్లి వద్దు అని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని తెలిపింది. అయితే ఇప్పుడు తన కుమార్తె వయసు 13 ఏళ్లు.. నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టం.. పెళ్లిపై చాలా నమ్మకం ఉంది.. పరిచయమేలేని ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడం.. ఆ బంధం చాలా బలమైనది.. మరో రెండేళ్లు తర్వాత పెళ్లి చేసుకుంటానని రేణు చెప్పింది.

ఆధ్య కాలేజీకి వెళ్ళాక నా గురించి నేను ఆలోచిస్తాను.. నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే వారు సంతోషంగానే ఉన్నారు.. ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటావంటే మళ్ళీ పెళ్లి చేసుకొని కొడుకు అకీరా చెప్పాడు.. ఆద్య‌ కూడా తనను పెళ్లి చేసుకోమనే చెబుతుంది. రెండేళ్ల తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్ తెలిపింది. ఇప్పుడు రేణు చేసే చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అప్పట్లో ఆమె పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే రెండో పెళ్లి చేసుకోలేదన్న పుకార్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు తన రెండో పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఎందుకు ?క్యాన్సిల్ అయిందో రేణు క్లారిటీ ఇవ్వటంతో దీనిపై ఇప్పటివరకు వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news