Movies' గాంజా శంక‌ర్ ' గా సాయితేజ్ ప‌క్కా మాస్ ఎంట్రీతో...

‘ గాంజా శంక‌ర్ ‘ గా సాయితేజ్ ప‌క్కా మాస్ ఎంట్రీతో పిచ్చెక్కించాడ్రోయ్ ( వీడియో)

మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చారు. కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నారు. ఇది సాయిధరమ్ తేజ్ కెరీర్ లో 17వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు ఫస్ట్ హై లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా మాస్‌గా మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా గాంజా శంకర్ టైటిల్తో మేకర్స్ ఈ సినిమాని కన్ఫామ్ చేశారు.

పక్కా మాస్ సేడ్ లో సాయి ధరమ్ తేజ్ ని దర్శ‌కుడు సంపత్ నంది ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ టీజర్ లో సాయి ధరంతేజ్ ఊర మాస్ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చాడు.. బ్యాక్ గ్రౌండ్లో ఓ పాప స్పైడర్ మాన్ లాంటి కథ‌కాకుండా… ఓ లోకల్ మీన్ కథ చెప్పమంటే సాయిధరమ్ తేజ్ ఎంట్రీ గురించి బ్యాగ్రౌండ్‌లో పరమ ఊర‌ మాస్ మాట‌లు వస్తూ ఉంటాయి. సాయిధరమ్ తేజ్ మేకోవర్ని ప్రజెంట్ చేసిన తీరు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉన్నాయి.

ఇందులో భీమ్స్‌ ఇచ్చిన ఆర్ఆర్‌ స్కోర్ కూడా అదిరింది. మొత్తానికి ఒక మాస్ కొలాబరేషన్ లో సాలిడ్ ట్రీట్ ఇవ్వటానికి సాయి ధరంతేజ్ – సంపత్ నంది ఇద్దరు సిద్దంగా ఉన్నారని చెప్పాలి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ – ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ సంస్థల సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏది ఏమైనా సాయి ధరమ్ తేజ్ నుంచి ఊర మాస్ సినిమా చూసేందుకు మనం రెడీగా ఉండాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news