Movies' లియో ' కు ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్...

‘ లియో ‘ కు ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ అరాచ‌కం… ఎన్ని కోట్లంటే…!

కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్ సినిమా లియో. గ‌తేడాది క‌మ‌ల్‌హాస‌న్‌తో విక్ర‌మ్ సినిమా తెర‌కెక్కించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎల్‌యూసీలో భాగంగా ఈ సినిమా తెర‌కెక్కించాడ‌న్న ప్రచారంతో ఈ సినిమా హైప్ మామూలుగా లేవు. కేవ‌లం రిలీజ్‌కు ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే రు. 100 కోట్ల షేర్ వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల టాక్ ?

దీనిని బ‌ట్టే లియోపై అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో ప్రీ సేల్స్ భారీ ఎత్తున జ‌రిగాయి. తొలి రోజు చాలా చోట్ల నిన్న‌టికే టిక్కెట్స్ అయిపోయాయి. ఇదిలా ఉంటే కేవ‌లం తొలి రోజునే రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లుపుకుంటే ఈ సినిమా రు. 15- 17 కోట్ల రేంజ్లో గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొడుతుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే రు. 8 కోట్ల రేంజ్‌లో షేర్ వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. తొలి రోజు షేర్ రు. 8 – 10 కోట్ల రేంజ్‌లో ఉండ‌నుంది. ఇది విజయ్ – లోకేష్ కనగరాజ్ కెరీర్ లోనే చాలా టాప్ అని చెప్పాలి. రీసెంట్‌గా వ‌చ్చిన డ‌బ్బింగ్ సినిమాల్లో కూడా ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌లో లియో సెన్షేష‌న‌ల్ రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news