Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' ప్రీ సేల్స్ వ‌సూళ్లు... రికార్డుల టాప్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ప్రీ సేల్స్ వ‌సూళ్లు… రికార్డుల టాప్ లేపేసిన బాల‌య్య‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తిరుగేలేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్‌ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటు అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ల తర్వాత బాలయ్య నటించిన సినిమా ఇది.

బాలయ్య ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్లు కొడతాడు అన్న నమ్మకాలు అందరిలోనూ ఉన్నాయి. సినిమాపై అంచనాలు అయితే మంచి హైప్‌ క్రియేట్ చేశాయి. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.. డే 1 వసూళ్లు మంచిగా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్ లో అయితే ప్రీ సేల్స్ లో భగవంత్ కేసరి దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 300కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదంతా కేవలం ప్రీమియర్ వ‌సూళ్లు మాత్రమే.. ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి హాఫ్ మిలియన్ మార్కుకు చేరువ అవుతుందనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వ‌సూళ్లు బాల‌య్య మాస్ ర్యాంపేజ్‌కు నిద‌ర్శ‌నం. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల – అర్జున్ రాంపాల్ – శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news