Newsఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌కు కూడా జై బాల‌య్యా పిచ్చి ప‌ట్టేసిందే..!

ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌కు కూడా జై బాల‌య్యా పిచ్చి ప‌ట్టేసిందే..!

గత మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ లో జై బాలయ్య అనే స్లొగన్స్ చాలా పవర్ ఫుల్ గా మారింది. ఆ మాటకు వస్తే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, దుబాయ్, యూకే ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా జై బాలయ్య అని నినాదాలు చేయడం కామన్ అయిపోయింది. జై బాలయ్య అనేది ఇప్పుడు ఒక పిచ్చిగా మారిపోయింది. నందమూరి వీరాభిమానులో లేదా.. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు లేదా తెలుగుదేశం అభిమానులు మాత్రమే కాదు ఏ హీరో అభిమాని నోట విన్నా జై బాలయ్య అనటం కామన్ అయిపోయింది.

అంటే బాలయ్య ఈ తరం జనరేషన్ కు కూడా ఎలా కనెక్ట్ ? అయిపోయాడో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. ముఖ్యంగా అన్‌స్టాప‌బుల్ టాక్ షో బాలయ్యను ఈ తరం జనాలకు పిచ్చపిచ్చగా కనెక్ట్ చేసింది. అసలు బాలకృష్ణను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు బాలయ్యకు వీరాభిమానులు అయిపోయారు. ఒకప్పుడు బాలయ్యను విమర్శించిన వాళ్ళు కూడా ఈ టాక్ షో తర్వాత బాలయ్యలో ఒరిజినాలిటీ చూసి బాలయ్య అంటే పడి చ‌స్తున్నారు. టాలీవుడ్లో ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి… ఏ హీరో అభిమాని.. ఏ సినిమా చూస్తున్న కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య అని నినాదాలు చేయడం కామన్ అయిపోయింది.

ఇప్పుడు ఈ స్లోగ‌న్‌ పవర్ ఫుల్ అయిపోయింది. చివరకు టాలీవుడ్ లో ఇతర హీరోలు.. మిడిల్ రేంజ్ హీరోలు కూడా తమ సినిమా ప్రమోషన్లలో జై బాలయ్య అని నినాదాలు చేస్తున్నారు అంటే బాలయ్య వారిపై ఎంతలా ప్రభావం చూపాడో తెలుస్తోంది. తన టాక్ షోకు టాలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోలు.. కుర్ర హీరోలు.. సీనియర్ హీరోయిన్లు ఇతర నటిమణులను కూడా తీసుకువచ్చి వాళ్ళందరికీ బాలయ్య పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అందుకే ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా జై బాలయ్య నినాదం మారుమోగుతోంది. ఆ సినిమా లేదు.. ఈ సినిమా లేదు ఏ హీరో సినిమా థియేటర్లలో ఆడుతున్న కూడా సినిమా చూసేందుకు వస్తున్న ప్రేక్షకులు జై బాలయ్య అంటున్నారు.

చివరికి తమిళ‌ డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే అక్కడ కూడా ఇదే స్లోగ‌న్‌ కామన్ గా మారిపోయింది. ఇప్పటికే నయనతార, అనుష్క, శ్రీలీల – అంజలి ఇలా ఎంతోమంది హీరోలు జై బాలయ్య నినాదాలు చేశారు. తాజాగా ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా వచ్చి చేరింది. తాజాగా పూనమ్ కౌర్ బాలయ్య నటించిన భగవంత్‌ కేసరి సినిమా చూసి ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమాలో మహిళా సాధికారత గురించి బాలయ్య చెప్పిన మెసేజ్ అద్భుతంగా ఉందని.. పూన‌మ్ కీర్తించింది. ఈ సినిమా చూశాక తాను కూడా జై బాలయ్య బ్యాచ్ లోకి చేరాలనుకుంటున్నానని పూనం కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూసిన నందమూరి అభిమానులు అందరూ పూన‌మ్‌కౌర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా చివరకు జై బాలయ్య స్లోగన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా పెద్ద పిచ్చిగా మారిపోయింది అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news