News' భ‌గ‌వంత్ కేస‌రి ' ఫ‌స్ట్ డే ఆల్ షోస్ హౌస్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ ఫ‌స్ట్ డే ఆల్ షోస్ హౌస్ ఫుల్‌… టిక్కెట్లేవ్ బ్ర‌ద‌రూ..!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ యాక్షన్ మూవీ భగవంత్‌ కేసరి మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించగా కాజల్ హీరోయిన్‌గా.. శ్రీలీల‌ బాలయ్య కూతురు పాత్రలో నటించారు. బాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు.

ఇప్పటికే బాలయ్య అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాపై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ప్రచార‌ చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై మామూలు హైప్ ఇవ్వ‌డం లేదు. ఇక నందమూరి అభిమానులు జోష్ అయితే మామూలుగా లేదని చెప్పాలి.

ఇక మంగళవారం సాయంత్రం ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ కాగా అన్ని ప్రాంతాలలో అదిరిపోయే బుకింగ్స్‌తో అదరగొడుతుంది. చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులతో ఫాస్ట్ ఫీలింగ్స్ జరుగుతుండడంతో మేకర్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. వైజాగ్ సిటీ లో తొలిరోజు సింగిల్ స్క్రీన్ లలో 40 షోలకు బుకింగ్స్‌ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే ఫుల్ అయ్యాయి.

విజయవాడ, గుంటూరు, ఏలూరు, సిడెడ్ లో అయితే ఇప్పటికే చాలా చోట్ల తొలిరోజు హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఏది ఏమైనా భగవత్ కేసరి మానియా మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news