Newsమెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ' చూడాల‌ని ఉంది ' కి ముందు ఫిక్స్...

మెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ చూడాల‌ని ఉంది ‘ కి ముందు ఫిక్స్ చేసిన 2 టైటిల్స్ ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చూడాలని ఉంది తాజాగా 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సౌందర్య, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్‌ చేసి.. సూప‌ర్‌ హిట్ అయింది.

ఈ సినిమా టైటిల్ వెనక ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింద.ట ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వయంగా తెలిపారు. ముందుగా వర్కింగ్ టైటిల్ గా కాళిక అంటే కలకత్తా కాళిక ( కాళీ దేవత ) అని గుణశేఖర్ తెలిపారు. ఇక చూడాలని ఉంది లాంటి సాఫ్ట్ టైటిల్ చిరంజీవి లాంటి స్టార్ హీరోకు ఎలా యాప్ట్ ?అవుతుందని సందేహాలు వచ్చాయట. ఇంత‌కు ఈ పేరు పెట్టింది ఎవరో ? కాదు చిరంజీవి స్వయంగా పెట్టారు.

గుణశేఖర్ కలకత్తా లేదా కాళికా అని పేరు పెట్టాలని అనుకున్నారట. ఈ టైంలో క్లాస్ టచ్ తో కూడిన యాక్షన్ సినిమా కాబట్టి సొగసు చూడతరమా టైటిల్ కూడా పరిశీలించారట. చూడాలని ఉంది టైటిల్ అయితే బాగుంటుందా ? అని చిరంజీవి స్వయంగా గుణశేఖర్‌ను అడిగారట. మెగాస్టార్ ఇమేజ్ కి ఈ టైటిల్ సరిపోదేమో అని గుణశేఖర్ ముందు కంగారుపడినా.. డిఫరెంట్ గా ఉంటుంది అని చివరకు అదే ఫిక్స్ చేశారట. అయితే గుణశేఖర్ ఆ తర్వాత సొగసు చూడు తరమా టైటిల్తో సినిమా తెరకెక్కించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news