Moviesదేవర హిట్ కొట్టిన కొరటాల ఏం పీకలేడా..? టైం ఇంత దరిద్రంగా...

దేవర హిట్ కొట్టిన కొరటాల ఏం పీకలేడా..? టైం ఇంత దరిద్రంగా ఉందేంటి బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు ..కొత్త కొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తున్నారు .. అనుభవంతో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డైరెక్టర్ లు ఇండస్ట్రీలో హిట్ టాక్ తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు సినిమాల తోనే సూపర్ స్టార్ స్టేటస్ దక్కించుకుంటూ డైరెక్టర్ లు సైతం పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకొని స్టార్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు . వాళ్లలో ఒకరే కొరటాల శివ అని చెప్పాలి .

కొరటాల శివ ఖాతాలో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ లేదు అని గర్వంగా చెప్పుకునేవాడు. కానీ ఆచార్యతో ఆ క్రేజీ రికార్డ్ నాశనం అయిపోయింది. కెరియర్ లో ఫస్ట్ టైం పరమ చెత్త సినిమాను తెరకెక్కించాడు అంటూ సొంత ఫ్యాన్స్ బూతులు తిట్టారు . ఈ బాధల నుంచి బయటపడాలి అంటే కచ్చితంగా ఒక హిట్ పడాలి. ఆ హిట్ కోసమే ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరికీ తెలిసిందే .

కొరటాల డైరెక్షన్ ఎన్టీఆర్ టైమింగ్ రైమింగ్ బాగుంటుంది . సినిమా హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సినిమా హిట్ కొట్టిన కొరటాలకు పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు అని జనాలు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోలు గా ఉన్న చరణ్ – తారక్ – బన్నీ – ప్రభాస్ – మహేష్ బాబు వరుసగా మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిపోయారు . ఒకరి తర్వాత ఒకరు డైరెక్టర్ లను సైతం హోల్డ్ లో పెట్టుకొని ఉన్నారు . చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ నాగార్జునలు సీనియర్ పాత్రలు చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడ యంగ్ స్టోరీస్ కి కనెక్ట్ అవ్వడం లేదు . ఇలాంటి క్రమంలో కొరటాల హిట్ కొట్టిన నెక్స్ట్ టాప్ హీరోతో సినిమా తీయాలంటే కచ్చితంగా గ్యాప్ కావాల్సిందే ..అలా కాదు అనుకొని యంగ్ హీరోతో సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.. అందుకే కొరటాల శివ దేవర సినిమాతో హిట్ కొట్టినా సరే కొన్నాళ్లు ఆయనకి బ్యాడ్ టైం తప్పదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి కొరటాల ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news