Moviesఫ్లైట్ లో శ్రీలీల అలా చేసిందా..? ఎవ్వరికి తెలియని సీక్రేట్ ని...

ఫ్లైట్ లో శ్రీలీల అలా చేసిందా..? ఎవ్వరికి తెలియని సీక్రేట్ ని బయటపెట్టిన తెలుగుహీరో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే తన అందచందాలతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలను అట్రాక్ట్ చేసింది . ఆ తర్వాత ధమాకా సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన శ్రీలీల..

ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ హీరో లతో నటిస్తుంది . ఇలాంటి క్రమంలోనే శ్రీలీలపై ఎక్కువ ఫోకస్ పడింది . రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న నాగశౌర్య శ్రీలీల పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . నిజానికి నాగశౌర్యతోనే శ్రీలీల తెలుగు ఎంట్రీ ఉండాల్సింది . ఛలో సినిమా ద్వారా శ్రీలీల తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటికి కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక చలో సినిమా రిజెక్ట్ చేసింది .

అయితే ఇదే విషయాన్ని చెప్తూ నాగ శౌర్య.. శ్రీ లీల మంచితనాన్ని బయటపెట్టాడు . “ఓ రోజు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు శ్రీలీల కూడా అక్కడే ఉంది . కానీ ఆమె నన్ను గమనించలేదు.. నేను ఆమెను గమనించాను ఒక ఓల్డ్ లేడీ సీట్ లాస్ట్ లో ఉంది.. ఆమె అంత దూరం నడవలేక పోతుంది ..అప్పుడు శ్రీలీల లేచి ఆమె సీటు లో ఆ ఓల్డ్ లేడీని కూర్చోబెట్టి.. ఆ ఓల్డ్ లేడీ సీట్లోకి శ్రీ లీల వెళ్ళింది ..నిజానికి ఏ హీరోయిన్ కూడా అలా చేయదు.. కానీ శ్రీలీలా అలా చేసింది .. అప్పుడే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా మంచిది అని.. అందుకే ఈరోజు ఈ పొజిషన్లో ఉంది శ్రీలీల “అంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీలీలకి సంబంధించిన పేరు ఇండస్ట్రీలో మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news