Moviesశ్రీలీల‌కు ఇచ్చిన డ‌బ్బుల‌కు రామ్‌కు ఇంత న్యాయం చేసిందో చూడండి (...

శ్రీలీల‌కు ఇచ్చిన డ‌బ్బుల‌కు రామ్‌కు ఇంత న్యాయం చేసిందో చూడండి ( వీడియో )

స‌హ‌జంగానే మ‌న తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ డాల్. అంత‌కు మించి న‌ట‌న‌లో ఊహించుకోవ‌డానికి ఏం ఉండ‌దు. త‌క్కువ మందికి… అది కూడా త‌క్కువ సినిమాల్లో మాత్ర‌మే న‌టించే స్కోప్‌కు ఛాన్స్ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో పెళ్లి సందD సినిమాతో ఒక్క‌సారిగా స‌ర్రున దూసుకువ‌చ్చింది శ్రీలీల‌. తెలుగు అమ్మాయి అయినా బెంగ‌ళూరులో సెటిల్ అయిన ఈ భామ ధ‌మాకాతో ఒక రేంజ్‌కు వెళ్లిపోయింది.

ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏకంగా 10 + సినిమాలు ఉన్నాయి. డే అండ్ నైట్ షూట్ చేస్తున్నా అస‌లు సినిమాలు అవ్వ‌డం లేదు. వీటిలో ముందుగా స్కంధ, ఆదికేశవ రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్ర‌మంలోనే రామ్‌కు జోడీగా న‌టించిన స్కంధ సినిమా నుంచి సాంగ్ వచ్చింది. శ్రీలీల త‌న‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌కు ఫుల్‌గా గిట్టుబాటు అయ్యేలా న్యాయం చేసిన‌ట్టుగా ఉంది.

మాంచి క‌ల‌ర్‌ఫుల్ డ్రెస్సులు వేసుకుని.. త‌న‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ కిట్టుబాటు అయ్యేలా.. ఎలా ఊపితే.. ఎలా డ్యాన్సులు చేస్తే కుర్ర‌కారు గుండెలు ఊగిపోతాయో సేమ్ అలాంటి స్టెప్పులే వేసింది. సాంగ్ మ‌రీ అంత గొప్ప‌గా లేక‌పోయినా శ్రీలీల అందానికి, ఆ ఊపుళ్ల‌కు శ్రీలీల బాగానే పెర్పామ్ చేసింది. ఇంకా చెప్పాలంటే శ్రీలీల ఊపుళ్ల ముందు రామ్ తేలిపోయిన‌ట్ల‌య్యింది.

రామ్‌కు సోలో పెర్పామెన్స్‌కు స్కోప్ ఇచ్చిన‌ట్లుంది. అదే ఇద్ద‌రిని ప‌క్క‌న పెట్టి చూస్తే రామ్ తేలిపోయేలా క‌నిపిస్తున్నాడు. రేపు సినిమాకు కూడా శ్రీలీల బాగా ప్ల‌స్ అవుతుంద‌నే స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేస్తే శ్రీలీల డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఆమె అందాలు బాగా ఎంజాయ్ చేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news