Moviesఫస్ట్ టైం పిల్లల ముఖాలు చూపించిన నయన్.. అమ్మ-నాన్న పోలికలు కనిపించడం...

ఫస్ట్ టైం పిల్లల ముఖాలు చూపించిన నయన్.. అమ్మ-నాన్న పోలికలు కనిపించడం లేదే..!?

సౌత్ ఇండస్ట్రీలోని క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతారకు ..ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ..పిల్లల తర్వాత తన రేంజ్ ని ఏమాత్రం తగ్గించుకొని నయనతార అందం విషయంలో మాత్రం అలాంటి స్పెషల్ అట్రాక్షన్ ని మైంటైన్ చేస్తుంది. కాగా ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార .. కోలీవుడ్లో మరికొన్ని ప్రాజెక్టులో భాగమైంది . కాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమా ద్వారా మరో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుంది నయన్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉండే నయనతార రీసెంట్గా ఇన్స్టా లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. నయనతార తన ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడానికి ఆమె తన ఫాలోవర్స్ ను అట్రాక్ట్ చేయడానికి తన పిల్లల ఫొటోస్ ను షేర్ చేసింది .

మొదటి పోస్ట్ ద్వారా లేడీస్ సూపర్ స్టార్ తన ట్విన్స్ కుమారులను పరిచయం చేసింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉన్న నయనతార ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టడం విశేషంగా మారింది . ఆగస్టు 31 న ఆమె ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెడుతూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చింది . ఈ సందర్భంగా తనను 40 వేల మందికి పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది . నయనతార పిల్లల ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే పలువురు ఆకతాయిలు నయనతార పిల్లలపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు అసలు అమ్మ నాన్న పోలికలు లేవే.. వీళ్ళకి అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో నయనతార ఫ్యాన్స్ వాళ్ళ పై మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news