Moviesషేకింగ్ న్యూస్‌… విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ష‌న్‌లో సినిమా… హీరో ఎవ‌రంటే..!

షేకింగ్ న్యూస్‌… విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ష‌న్‌లో సినిమా… హీరో ఎవ‌రంటే..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో విజయ్ తన అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు. సోషల్ మీడియా ఖాతాలలో ఇది లైవ్ లో స్ట్రీమ్ అయ్యింది. ఈ క్రమంలోనే విజయ్ ఖుషి సినిమా హైలెట్స్ తో పాటు తన పర్సనల్ లైఫ్ అభిప్రాయాలను బయటపెట్టారు.

ఖుషి సినిమాలో ఎమోషన్ – రొమాన్స్ – యాక్షన్ కంటే ఫన్ చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశానని.. ఫస్ట్ ఆఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కౌట్ అయింది.. ఇక సెకండ్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.. ఖుషి టైటిల్ సాంగ్ కూడా వినగానే బాగా నచ్చింది అని విజయ్ చెప్పాడు. ఇక సమంత గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా కూడా సహకరించింది అని.. ఆమె చాలా తెలివైన అమ్మాయి.. శివ నేను ఈ సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడే ఆమె మంచి ఐడియాస్ చెప్పేదన్నాడు.

మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము.. దీంతో డబ్బు, లైఫ్ గురించి ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయని విజయ్ చెప్పాడు. ఇక తనకు డైరెక్షన్ అంటే ఎంతో ? ఇష్టం అని.. డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్‌ చేస్తూ ఉంటుంది.. లైఫ్ లో కొద్దికాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా.. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిఫ్ట్‌ చదువుతుంటే నటించటం ఆపలేను అనిపిస్తూ ఉంటుంద‌ని తెలిపాడు.

ఇప్పుడు వయసు ఉంది.. ఎంతైనా కష్టపడతా భవిష్యత్తులో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు డైరెక్షన్ వైపు వెళ్తానని చెప్పాడు.. ఏది ఏమైనా విజయ్ దేవరకొండకు డైరెక్షన్ మీద ఎంత ? ఆసక్తి ఉందో తెలుస్తోంది. విజయ్ తాను లేదా తన తమ్ముడు ఆనంద్‌ హీరోగా డైరెక్ట్ చేస్తే చూడాలని ఉందని విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లను హోరెత్తిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news