Moviesభార్య‌కు విడాకులు ఇచ్చేసిన స్టార్ హీరో.. మామ‌కోసం ఏం చేశాడో చూడండి..!

భార్య‌కు విడాకులు ఇచ్చేసిన స్టార్ హీరో.. మామ‌కోసం ఏం చేశాడో చూడండి..!

అభిమానం వేరు.. అనుబంధం వేరు అని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి నిరూపించారు. తాను రజనీకాంత్ వీరాభిమానిగా గతంలో ధనుష్ చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా తన వీరాభిమాని రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

అయితే అనూహ్యంగా గత ఏడాది ధనుష్ – ఐశ్వర్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పటినుంచి చాలాకాలంగా రజినీకాంత్ కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్ తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతుంది. రజని కథానాయకుడుగా నటించినా తాజా సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

చాలా ఏళ్ల తర్వాత రజనీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోని ధనుష్ ఇట్స్ జైలర్ వీక్ ( ఇది జైల‌ర్ వారం) అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ధనుష్యబిమానులు తాను ముందు రజనీకాంత్ అభిమాని అని.. ఆ తర్వాతే అన్ని అని ధనుష్ మరోసారి నిరూపించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ధనుష్ చేసిన ఈ కామెంట్ సినిమాపై మరింత హైప్ రావడానికి కారణమైంది. ఏదేమైనా ధ‌నుష్ త‌న భార్య‌కు విడాకులు ఇచ్చేసినా మామ‌పై ఉన్న అభిమానం మ‌రోసారి చాటుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news