Newsహ‌రికృష్ణ హిట్‌ సినిమా క‌థ‌తో బాలయ్య ' భ‌గ‌వంత్ కేస‌రి '...

హ‌రికృష్ణ హిట్‌ సినిమా క‌థ‌తో బాలయ్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ సినిమానా… క్లారిటీ వ‌చ్చేసింది..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ – కాజల్ అగర్వాల్ జంటగా మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్‌ కేసరి. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి.

దీనికి తోడు బాలయ్య అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో కెరీర్ లోనే తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ ప్రియాంక జువాల్క‌ర్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ రామ్‌పాల్‌ది విల‌న్ రోల్‌. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా గురించి ఒక ఫేక్ న్యూస్ బయట వైరల్ అవుతుంది. బాలయ్య సోదరుడు హరికృష్ణ – సీనియ‌ర్ హీరోయిన్ మీనా కలయికలో వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో 2004లో తెర‌కెక్కిన హిట్ సినిమా స్వామికి రీమేక్‌గా భగవంత్‌ కేసరి తెరకెక్కుతుందని సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి.

అయితే వీటిపై భగవవ‌త్ కేసరి మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా స్పందించారు. తమ భగవంత్‌ కేసరి సినిమా స్వామికి ఏమాత్రం రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది అని.. బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలవబోతుందని.. అక్టోబర్ 19న థియేటర్లలో భగవంత్ కేస‌రి ద్వారా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం చూస్తారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమాపై వస్తున్నవి అన్ని పుకార్లు అని తేలిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news