Newsఎన్టీఆర్ అనుకున్న సినిమాలో విజయ్ దేవరకొండ.. చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్..!?

ఎన్టీఆర్ అనుకున్న సినిమాలో విజయ్ దేవరకొండ.. చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఒక హీరో కోసం రాసుకున్న కథలో మరో హీరో ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయిం. ది ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ అలాంటి మూవీస్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాగా తాజాగా అలాగే మరో బిగ్ ప్రాజెక్టు చేతులు మారినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నాడు .

ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న తారక్ వద్దకు మరో బిగ్ ప్రాజెక్ట్ వచ్చి చేరింది . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో “జటాయు” సినిమాలో హీరోగా తారక్ ని అనుకున్నారట . ఈ క్రమంలోనే మైథాలజికల్ టచ్ ఉన్న ఈ భారీ సినిమాలోన టిస్తే చాలా బాగుంటుందని ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా ఈ సినిమా నిలవబోతుంది అని అనుకున్నారు .

అయితే ఈ స్టోరీ విన్న్ తారక్ ..కథ నచ్చిన కారణంగా ఈ సినిమా చేయడానికి మరికొంత టైం అడిగారట. అంత టైం కేటాయించలేని మేకర్స్ ఈ ప్రాజెక్టు ని సరాసరి విజయ్ దేవరకొండ వద్దకు తీసుకెళ్లి వివరించినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఇంప్రెస్ అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాకి ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ మార్కెట్ ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలిసిందే. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ఉంటుంది . ఈ క్రమంలోనే ఈ స్టోరీకి పర్ఫెక్ట్ హీరో విజయ్ దేవరకొండ అని ఆయన బెస్ట్ ఆప్షన్ గా తీసుకున్నారట మేకర్స్ . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news