Newsకాళ్ళు అక్కడ పెట్టి అర్జున్ రెడ్డి బ్యూటీతో వెకిలి చేష్టలు.. ...

కాళ్ళు అక్కడ పెట్టి అర్జున్ రెడ్డి బ్యూటీతో వెకిలి చేష్టలు.. పబ్లిక్ లోనే ఇంత ఛండాలమైన పనులా..!!

ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిల లిస్ట్ ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అమ్మాయిలకు ఎక్కడ సేఫ్టీ లేకుండా పోయింది . అది స్కూల్ కాదు ..వర్క్ చేసే ప్లేస్ కాదు.. దేవాలయం కాదు ..ఎక్కడైనా సరే అమ్మాయిలను గోకే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు . అమ్మాయిలతో కొందరు వ్యక్తులు వెకిలి చేష్టలు చేసి పైశాచిక ఆనందాన్ని పొందే మగాళ్ళ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది . తాజాగా అలాంటి ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి సెన్సేషన్ గా మారిపోయింది తెలుగు నటి శ్రీ సుధా .

ఇలా చెప్తే తెలుగు జనాలకు గుర్తు పట్టడం చాలా కష్టమే అర్జున్ రెడ్డి సినిమాతో తనదైన స్టైల్ లో నటించిన బ్యూటీ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొస్తుంది . శ్రీ సుధా అంతకు ముందు కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది . కానీ అర్జున్ రెడ్డి సినిమా ద్వారానే పాపులారిటీ సంపాదించుకుంది . కాగా శ్రీ సుధా ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురయింది . అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. కాగా శ్రీ సుధా అతగాడి కాళ్ళ ఫోటోని సైతం షేర్ చేసింది.

ఇలాంటి క్రమంలోనే ఆమె విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు వెనుక ఉన్న ప్యాసింజర్ ఆమెతో వెకిలి చేష్టలు చేశారు. పదేపదే కాళ్ళతో ఆమెను గోకుతూ వచ్చాడు . అయితే రెండు మూడు సార్లు అక్కడున్న సిబ్బందికి కంప్లైంట్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది . ఈసారి తనలోని వైల్డ్ యాంగిల్ ని బయట పెడుతూ ఏకంగా ఓసారి గట్టిగా లాగి పెట్టి తొక్కేసింది . దెబ్బకి సైలెంట్ అయిపోయాడు అతగాడు . ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది . అతని ఎముకలు విరిగి ఉంటే నాకు సంబంధం లేదు అంటూ కూడా కామెంట్ పెట్టింది. దీంతో తన కాళ్ల ఫొటోస్ సైతం షేర్ చేయడంతో నటి శ్రీ సుధ.. డేర్ నెస్ కి ఫిదా అయిపోతున్నారు జనాలు . ప్రజెంట్ ఆమె షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news