Moviesఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు ఇవే... సూప‌ర్ హిట్లు... అట్ట‌ర్‌ప్లాప్‌లు...

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు ఇవే… సూప‌ర్ హిట్లు… అట్ట‌ర్‌ప్లాప్‌లు కూడా…!

జూనియర్ ఎన్టిఆర్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డైలాగ్ లు చెప్పాలన్న, డాన్స్ వేయాలన్న, స్పీచ్ లు ఇవ్వాలన్న ఎన్టిఆర్ తరువాతే. కళ్ళతోనే నటించడం ఎన్టిఆర్ కు మాత్రమే సాధ్యం. తాజగా RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులని సృష్టించింది. ఈ సినిమా తరువాత మరో ఎన్టిఆర్ మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ తరువాత ఎన్టిఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడు. వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఎన్టిఆర్ బిజీబిజీగా ఉన్నారు. అయితే గతంలో ఎన్టిఆర్ 12 పెద్ద సినిమాలను రిజెక్ట్ చేసారంట. అయితే ఆ 12 సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లు కొట్టాయి. ఆ 12 సినిమాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

  1. కిక్ – కిక్ సినిమా రవితేజ కెరీర్ లో ఎంత పెద్ద హిట్ సినిమానో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికి టీవీలో వస్తే కదలకుండా చూస్తున్నారు. ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ముందు ఎన్టిఆర్ కి అనుకున్నారు కానీ చివరికి రవితేజ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.
  2. దిల్ – ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఒక మరిచిపోలేని సినిమా అనే చెప్పాలి. కాలేజీ స్టూడెంట్ గా నితిన్ ఈ సినిమాలో అదరగొట్టారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారంట.
  3. శ్రీమంతుడు – కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఒక క్లాసిక్. మహేష్ బాబు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. కొరటాల శివతో ఎన్టిఆర్ జనతా గ్యారేజ్ సినిమా చేసారు. ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నారు. శ్రీమంతుడు కూడా చేసి ఉంటె హ్యాట్రిక్ కొట్టేవారని అభిమానులు అంటున్నారు.
  4. ఆర్య – అల్లుఅర్జున్ కెరీర్ లో ఆర్య సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్, సుకుమార్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పుష్ప 2 చేస్తున్నారు. అయితే ఆర్య సినిమాని కూడా ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారు.
  5. అతనొక్కడే – సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఎన్టిఆర్ మరో సినిమా మిస్ అయ్యారు. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
  6. భద్ర – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా భద్ర. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి చాలా మందికి ఫేవరెట్.
  7. కృష్ణ – వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టిఆర్ మరో సినిమా మిస్ చేసుకున్నాడు. కృష్ణలో రవితేజ, బ్రహ్మానందం టైమింగ్ ఎప్పటికి గుర్తుండిపోతుంది.
  8. ఎవడు- రాంచరణ్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ ఎవడు. అయితే ఈ సినిమా ముందు ఎన్టిఆర్, కళ్యాణ్ రామ్ చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసారు. అయితే డేట్స్ సెట్ కాకపోవడంతో రాంచరణ్, అల్లుఅర్జున్ కి చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
  9. ఊపిరి- నాగార్జున కెరీర్ లో ఊపిరి సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది. కార్తీ క్యారెక్టర్ ముందు ఎన్టిఆర్ అనుకున్నారు డైరెక్టర్ వంశీ. కానీ కథలో కొన్ని మార్పులు చేయాలని ఎన్టిఆర్ చేయడంతో వంశీకి నచ్చక కార్తీని తీసుకున్నాడు.
  10. బ్రహ్మోత్సవం – ఈ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది.
  11. నా పేరు సూర్య – అల్లుఅర్జున్ చేసిన ఈ సినిమా ఎన్టిఆర్ చేయాల్సింది. అయితే ఈ కథని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారు.
  12. శ్రీనివాస కళ్యాణం – ఈ సినిమా మొదట డైరెక్టర్ ఎన్టీఆర్ కు చెప్పారంట. అయితే సున్నితంగా వద్దని ఈ సినిమాని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారంట. దీంతో ఈ సినిమా నితిన్ వద్దకు వెళ్ళింది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news