Moviesవాట్: ఇండస్ట్రీలోకి రాక ముందు శ్రీలీల ..అలాంటి గబ్బు పనులు చేసిందా..?

వాట్: ఇండస్ట్రీలోకి రాక ముందు శ్రీలీల ..అలాంటి గబ్బు పనులు చేసిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడమే గొప్ప విషయం అనుకుంటున్నా టైం లో ఈ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడమే కాకుండా టాప్ హీరోయిన్గా మారి ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . ప్రజెంట్ శ్రీలీల చేతిలో ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి . అన్ని బడా బడా ఆఫర్లు కావడం గమనార్హం.

అయితే శ్రీలీల ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె యాక్టీవ్ నెస్.. అని చెప్పుకొస్తున్నారు ఫాన్స్. అయితే చాలా సరదా సరదాగా ఉండే శ్రీలీల ఇలా చిన్నతనంలో చేసిన గబ్బు పనులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఇవి సరదాగానే ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . చిన్నతనంలో శ్రీ లీల చాలా సార్లు అమ్మకు దొంగ సాకులు చెప్పి స్కూల్ కి ఎగ్గొట్టేసేదట .

ఎందుకంటే ఆమెకు చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు ఆడుకునే దానికి ఛాన్సే ఇచ్చేవారు కాదట . మొదట స్కూల్ ..ఆ తర్వాత ట్యూషన్.. ఆ తర్వాత యాక్టింగ్ క్లాసెస్ ..ఆ తర్వాత డాన్సింగ్ క్లాసెస్ అంటూ కంటిన్యూగా షెడ్యూల్ ని ఫిక్స్ చేసేవారట. దీంతో శ్రీలీలకు ఆడుకోవడానికి టైమే ఉండేది కాదట . ఈ క్రమంలోనే కొన్నిసార్లు దొంగ కడుపు నొప్పి.. ఫీవర్లు వచ్చాయి అంటూ అబద్ధాలు చెప్పి ఎన్నోసార్లు స్కూల్ కి డుమ్మా కొట్టిందట . దీంతో సరదాగా ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news