Moviesన‌గ్మా ఆ స్టార్ సెల‌బ్రిటీకి రెండో భార్య అయ్యిందా.... సీక్రెట్‌గా మూడు...

న‌గ్మా ఆ స్టార్ సెల‌బ్రిటీకి రెండో భార్య అయ్యిందా…. సీక్రెట్‌గా మూడు ముళ్లు..!

భారత దేశంలో సినిమా వాళ్లకు, క్రికెటర్లకు అభిమానులు భారీగా ఉంటారు. వారు ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు చాలా ఇష్టం చూపుతుంటారు. ఒక్కోసారి ఇంట్లో వారికి ఏమైనా పట్టించుకోరు కానీ తమ అభిమాన క్రికెటర్ లేదా నటీనటులకు ఏదైనా జరిగితే ఫ్యాన్స్ తట్టుకోలేరు. కొందరైతే పనిగట్టుకుని విమర్శలు చేస్తుంటారు.

ఏదేమైనా ప్రస్తుతం ఇంటర్ నెట్ విస్తృతంగా వాడకంలో ఉంది. అయితే ఇంటర్‌నెట్ అంతగా వాడకం లేని రోజుల్లో కూడా గాసిప్స్ దావానలంలా పాకిపోయేవి. కొన్నేళ్ల క్రిందట క్రికెటర్ సౌరవ్ గంగూలీ, నటి నగ్మ గురించిన వార్తలు కూడా ఇలాగే ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా నగ్మ జీవితంలో గంగూలీ అంశం ఎప్పటికీ మరిచిపోలేని చేదు గుర్తు. ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారని అందరికీ తెలుసు. అయితే వారిద్దరికీ పెళ్లి కూడా అయిందనే వార్త ప్రస్తుతం మరోసారి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, భోజ్‌పురి, బెంగాలీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నగ్మ నటించింది. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో ఆమె నాటి స్టార్ క్రికెటర్ గంగూలీని ప్రేమించింది. ఈ విషయం గంగూలీ భార్య డోనాకి తెలిసింది. అయితే సెలబ్రెటీల జీవితంలో ఇలాంటివి మామూలే అని వారు పబ్‌లకు వెళ్తున్నా ఆమె పట్టించుకోలేదు. వీరు తిరుపతికి వెళ్లినట్లు కొన్ని ఫొటోలు, తర్వాత ఏకంగా పెళ్లి చేసుకున్నట్లు మరో కొన్ని ఫొటోలు జాతీయ మీడియాలో ప్రచురితం అయ్యాయి.

దీంతో దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. ముఖ్యంగా గంగూలీ భార్య డోనా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే డోనాను గంగూలీ బ్రతిమిలాడుకున్నాడని, ఇంకెప్పుడూ నగ్మ జోలికి వెళ్లనని భార్యకు ప్రామిస్ చేశాడని తెలుస్తోంది. ఏదేమైనా ఈ అంశం నగ్మను బాగా కుంగదీసింది. తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news