Moviesఆ స్టార్ హీరోతో ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య రెండో పెళ్లి... ధ‌నుష్‌కు...

ఆ స్టార్ హీరోతో ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య రెండో పెళ్లి… ధ‌నుష్‌కు బిగ్ షాక్‌..!

ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒకటే వార్త. నటీనటులు ఒకరినొకరు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకుని కొంత కాలానికి ఏవో కార‌ణాల‌తో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇలానే తాజాగా తమిళ్ క్రేజీ హీరో ధనుష్ – ఐశ్వర్య ఇద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు. ప్ర‌స్తుతం ఎవ‌రి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని 15 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చాక అంద‌రికి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకొని విడిపోయారు.

ఐశ్వర్య.. రజనీకాంత్ కూతురు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ధనుష్ ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్టింగ్ లో రజనీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం స్టార్ హీరోగా ధనుష్ మంచి క్రైజ్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఐశ్వర్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె రెండో పెళ్లికి రెడీగా ఉన్నారని.. ఓ కోలీవుడ్ యంగ్ హీరోతో ఐశ్వర్య ప్రేమాయణం నడుపుతుందంటున్నారు.

చెన్నైలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో ఆ యంగ్ హీరోతో కలిసి ఐశ్వర్య కనిపించడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు పిల్లల‌ తల్లి అయిన ఐశ్వర్య మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి ? అంటూ సిని విశ్లేషకులు కూడా స్ట‌న్ అవుతున్నారు. అంత‌కుముందు ఐశ్వ‌ర్య సోద‌రి సౌంద‌ర్య కూడా మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేశాక మ‌రో వ్య‌క్తిని రెండో భ‌ర్త‌గా స్వీక‌రించింది.

ఇప్పుడు ఐశ్వ‌ర్య విష‌యంలో కూడా రెండో పెళ్లి వార్త‌లు బ‌య‌ట‌కి రావ‌డంతో కొంత వయసు వచ్చేటప్పటికి కష్టసుఖాలు పంచుకోవడానికి ఒక మనిషి తప్పకుండా తోడు ఉండాల‌ని.. మగవారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవారు చేసుకోవడంలో తప్పేముందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వ‌ర్య ఇండ‌స్ట్రీకే చెందిన హీరోను రెండో భ‌ర్త‌గా చేసుకోవ‌డం ధ‌నుష్‌కు నిజంగానే బిగ్ షాక్ అంటున్నారు. మ‌రి కొంతమంది మాత్రం పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ఐశ్వ‌ర్య‌కి మళ్ళీ పెళ్లి అవసరమా అంటూ నెగ‌టివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news