Moviesపెళ్లికి ప‌బ్లిసిటీ… పెటాకుల‌కు ప్రైవ‌సీనా.. నిహారిక నీతులు చూడండి..!

పెళ్లికి ప‌బ్లిసిటీ… పెటాకుల‌కు ప్రైవ‌సీనా.. నిహారిక నీతులు చూడండి..!

రాజకీయ నాయకులకు.. సినిమా జనాలకు పబ్లిసిటీ పిచ్చి బాగా ఉంటుంది. జనాల నోళ్ళలో ఎంత నానితే అంత క్రేజ్ ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఒక్కోసారి వారు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే సడన్గా వీళ్ళకు ఉన్నట్టు ఉండి ప్రైవసీ అనే పదం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మెగాడాట‌ర్‌ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది. ఈ విషయం గత ఆరేడు నెలలుగా సోషల్ మీడియాలో బాగా రచ్చ అయ్యింది.

విడాకులు తీసుకున్న వెంటనే తాను చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. తమకు ప్రైవసీ కావాలని దయచేసి తమను అర్థం చేసుకోవాలి అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అదే పెళ్లి టైంకి వచ్చేసరికి నిహారిక ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుంది. డెస్టినేషన్ వెడ్డింగ్, డిజైనర్ దుస్తులు, ఖరీదైన గిఫ్టులు.. వెడ్డింగ్ కార్డులు ఇలా ప్రతి అంశాన్ని ప్రమోట్ చేసుకున్నారు.

చివరకు పెళ్లి తర్వాత తుమ్మినా.. దగ్గినా కూడా ఒక రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు. అప్పుడు మాత్రం ప్రచారం కావాలి.. సడన్గా ఇప్పుడు నిహారికకు ఉన్నట్టు ఉండి పెళ్లి పెటాకులు కావడంతో ప్రైవసీ కావాలని కోరుతుండటం విడ్డూరంగా ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు తారులు అయితే పెళ్లిని చివరకు ఓటీటీలకు కూడా భారీరేట్లకు అమ్ముకున్నారు. అయితే పెటాకుల అంశాన్ని చిన్న వార్తగా కవర్ చేసిన తట్టుకోలేకపోతున్నారు.

విడాకుల వార్తలను కవర్ చేయొద్దు అనే హక్కు వారికి ఎలా ? ఉంటుందన్న చర్చలు కూడా మొదలవుతున్నాయి. పెళ్లి వార్తలు ఒక రేంజ్ లో హైలైట్ చేసి విడాకుల గురించి అసలు వార్తలు ఇవ్వద్దు ..తనకు ప్రైవసీ కావాలని నిహారిక అనటం విడ్డూరంగా ఉందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా నిహారిక భర్తతో విడిపోవడం అధికారికం అయ్యింది. ఇప్పుడు ఆమె తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news