Moviesబాక్స్ ఆఫిస్ దుమ్ముదులిపేసిన 'బేబి'..సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు...

బాక్స్ ఆఫిస్ దుమ్ముదులిపేసిన ‘బేబి’..సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే.. ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ రికార్డ్.. !!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “బేబీ”. హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది . నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . కాగ నేటి జనరేషన్ అమ్మాయిలు – అబ్బాయిలు ఏ విధంగా ఉన్నారు.. అనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు సాయి రాజేష్.

అంతేకాదు అప్పటివరకు స్కూల్ డేస్ కాలేజీ డేస్ గడిపిన ఓ అమ్మాయి పూర్తిగా స్వేచ్ఛనిస్తే ఎలా మారిపోతుంది..? ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఎంతవరకు ఉండాలి ..? అనేది ఈ సినిమాలో బాగా చూపించారు . అయితే క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి అర్థం కాక గజిబిజీ చేసేసిన సాయి రాజేష్ సినిమాకి కూసింత డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేశారు . అయితే మొదటి నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది . ఆనంద్ దేవరకొండ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది.

ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబి’ మూవీ కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమా మొత్తంగా రూ. 2.50-3.00 కోట్లు వరకూ షేర్ లభించినట్లు తెలిసింది. అంతేకాదు మిగిలిన ఏరియాలను కలుపుకుని ఇది ఫస్ట్ డే ఏకంగా రూ. 3.50 కోట్లు వరకూ షేర్ రాబట్టిన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం 150ఖ్ డాలర్లను వసూలు చేసి తెలుగు సినిమాసత్తా చాటుకుంది. కాగా బేబీ సినిమా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఈ విధంగా మనం మొత్తంగా చూసుకుంటే రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇది ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news