News"ట్రైలర్ తో ఫ్లాప్ టాక్.. సినిమా సూపర్ హిట్".. ఆది పురుష్...

“ట్రైలర్ తో ఫ్లాప్ టాక్.. సినిమా సూపర్ హిట్”.. ఆది పురుష్ రూపురేఖలు మార్చేసింది ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్షన్ లో తెరకెక్కిన .. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా రిలీజ్ అయిన ఫస్ట్ షో తోనే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఆది పురుష్.. ప్రజెంట్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఆది పురుష్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోలింగ్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

రాముడిగా ప్రభాస్ ఫ్లాప్ అని.. అసలు వి ఎఫ్ ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని .. సినిమా దొబ్బేస్తుందని.. 500 కోట్లు భారీ బొక్కఅని .. ప్రభాస్ కెరియర్ లోనే ఇది పరమ చెత్త సినిమాగా నిలుస్తుంది అని.. నానారకాలుగా ట్రోల్ చేశారు . మరికొందరు ఏకంగా ప్రభాస్ వ్యక్తిగత జీవితాన్ని సైతం దీనిలోకి లాగుతూ దారుణంగా టార్చర్ చేశారు. కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ టాక్ను నమోదు చేసుకుంది . కాగా ట్రైలర్ తో ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న సినిమా.. హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ట్రైలర్ టాక్ తో వచ్చిన నెగెటివిటీని పాజిటివిటీగా మార్చుకునే ప్రయత్నాలు చేసి ఓం రావత్ సూపర్ సక్సెస్ అయ్యాడూ. మనకు తెలిసిందే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ ని రూమ్ లోకి రమ్మంటూ ఘాటుగా పిలిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ రూమ్ లోకి పిలిచి ప్రభాస్ ఏం చెప్పాడో ఏమో కానీ ..ఒళ్ళు కంట్రోల్ లో పెట్టుకొని భయం భక్తులతో ఆ తర్వాత సినిమాలోని పలు సీన్స్ బాగా మార్చడని .. ఆ కారణంగానే ఆది పురుష్ రూప రేఖలు మారిపోయి.. ఇప్పుడు జనాలకు నచ్చే విధంగా తెరకెక్కించారని ఓం రావత్ ని పొగిడేస్తున్నారు . మొత్తానికి తన సినిమా ఫ్లాప్ కాకుండా ప్రభాస్ బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడు . ఒకసారి ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావత్ ని రూంలోకి పిలిస్తేనే ఇంత సినిమా హిట్ అయింది అంటే .. ఇంకొకసారి రూమ్ లోకి పిలిస్తే సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చేస్తాది అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news