Moviesఘనంగా లావణ్య-వరుణ్ తేజ్ ల నిశ్చితార్ధం.. మెగా ఫ్యామిలీ చేసిన బిగ్గెస్ట్...

ఘనంగా లావణ్య-వరుణ్ తేజ్ ల నిశ్చితార్ధం.. మెగా ఫ్యామిలీ చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా హీరో వరుణ్ తేజ్ -లావణ్య నిశ్చితార్ధానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి . మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అందరి హీరోలా కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలో నటిస్తూ తన కంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వరుణ్ తేజ్ ఇవాళ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్ధం చేసుకుని ఓ ఇంటి ఇంటివాడయ్యారు. అయితే ఈ న్యూస్ ని ఇప్పటివరకు మెగా కుటుంబం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు .

దానికి మెయిన్ రీజన్ ఇంట్లో డివోర్స్ తీసుకున్న కూతురు ఉండడమే కారణం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో లావణ్య – వరుణ్ నిశ్చితార్ధం జరగబోతుంది అంటూ డేట్ తో సహా ప్రచారం జరిగింది . జూన్ 9వ తేదీ లావణ్య – వరుణ్ నిశ్చితార్థం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. అయితే పలువురు మెగా ఫ్యామిలీకి సన్నిహితులైన వాళ్ళు కూడా ఈ న్యూస్ ని కన్ఫామ్ చేశారు. అయితే మెగా వరుణ్ తేజ్ -లావణ్య నిశ్చితార్ధం చేసుకున్నాక కూడా ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా మీడియాకి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా దాచి పెట్టేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ తప్పు చేస్తుందని.. వాళ్లను ఎంతగానో అభిమానించి ఆరాధించే ఫ్యాన్స్ కోసమైనా కొన్ని ప్క్స్ షేర్ చేసి ఈ న్యూస్ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాలని కోరుకుంటున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు చిరంజీవి గాని.. నాగబాబు గాని ..వరుణ్ తేజ్ గాని ..లావణ్య త్రిపాఠి గాని స్పందించకపోవడం గమనార్హం . ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎందుకు తమ నిశ్చితార్ధపు ఫోటోలను బయటకు రానివ్వలేదు అన్నది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news