Movies"ఆ విషయంలో తమన్నా అలా..విజయ్ వర్మ ఇలా".. మరి ప్రేమ ఎలా...

“ఆ విషయంలో తమన్నా అలా..విజయ్ వర్మ ఇలా”.. మరి ప్రేమ ఎలా పుట్టిందబ్బా..?

ప్రేమ పిచ్చిది.. గుడ్డిది అంటుంటారు . ఎప్పుడు ఎవరి లైఫ్ లో ఎలా పుడుతుందో ..ఎవ్వరికి తెలియనే తెలియదు అంటుంటారు. బహుశా తమన్నా – విజయ్ వర్మ లవ్ స్టోరీ చూస్తే నిజంగా ఇది నిజమే అనిపిస్తుంది . లేకపోతే ఎక్కడ తమన్న.. ఎక్కడ విజయ్ వర్మ.. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది . కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ ప్రశ్న అర్థం గానే ఉంది . నిజంగానే వీళ్ళు ప్రేమించుకుంటున్నారా..? లేదా టైంపాస్ లవా..? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఇండస్ట్రీలోకి 13వ ఏట ఎంట్రీ ఇచ్చిన తమన్నా ..ఇప్పటివరకు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎన్నో నటించింది.. ఎన్నో అవార్డులను అందుకుంది . ప్రస్తుతం ఒకవైపు వెబ్ సిరీస్ ..మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది ..మొత్తంగా ఆమె వద్ద నాలుగు వజ్రాలు మూథలు ఉన్నాయని.. 200 కోట్లకు పైగానే ఆస్తి సంపాదించింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తమన్నా ఆరు సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే విజయ్ వర్మ పరిస్థితి అలా కాదు మొదటి నుంచి బిలో యావరేజ్ ఫ్యామిలీ . విజయ్ వర్మ పక్క హైదరాబాది . హస్తకళ వ్యాపారం చేసే మార్వాడి కుటుంబంలో పుట్టిన విజయ్.. పూణేలో యాక్టింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ముంబైకి యాక్టింగ్ కోసం వెళ్ళాడు . థియేటర్స్ లో నటించడం మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ గా ఎదుగుతున్నాడు .

తెలుగులో ఎంసీఏ సినిమా ద్వారా పరిచయమైన విజయ్ వర్మ ఆస్తి అటు తిప్పి.. ఇటు తిప్పి ..ఎటు తిప్పినా సరే 20 కోట్లకు మించదు . అయితే 200 కోట్ల ఆస్తి కలిగి నాలుగు వజ్రాలు మూథలు ఉన్న తమన్న ఎలా ఇంత చిన్న స్థాయి హీరోని ప్రేమించగలిగిందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . దీని వెనక ఏదో పెద్ద మర్మమే ఉందని భావిస్తున్నారు . దీంతో వీళ్ల మధ్య ప్రేమ నిజంగా నిజమేనా..? లేకపోతే ప్రేమ గుడ్డిది..పిచ్చిది అన్నట్లు .. అలాంటి స్టేటస్ కోసం ప్రేమించుకుంటున్నారా..? ఏమో ఈ విషయం వాళ్లకే తెలియాలి . చూద్దాం మరి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవుతారు.. మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని విడిపోతారు . ఆ దేవుడికే తెలియాలి. చూడాలి మరి ఈ ప్రేమ బంధం ఎక్కడి వరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news