Moviesపవన్ కళ్యాణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఆ దబ్బులతో ఏం...

పవన్ కళ్యాణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఆ దబ్బులతో ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఆయనను ఓ హీరోగా కాకుండా దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు ఆయన అభిమానులు . ప్రజెంట్ పాలిటిక్స్ లోను సినిమాల్లోనూ బిజీ బిజీగా వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ కమిట్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి తన జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకు అంకితం చేయాలి అంటూ డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని చక చక షూట్ కంప్లీట్ చేసేస్తున్నారు.

కాగా మొన్న ప్రచార సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ “నేను ఒక్కరోజు షూటింగ్ కి రెండు కోట్లు తీసుకుంటాను ” . అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రెమ్యూనిరేషన్ గురించి కొందరు ఏకిపారేశారు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఇప్పుడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అంతకుముందు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు .. ఫస్ట్ సినిమాకి ఎంత పారితోషికం పుచ్చుకున్నాడు అన్న విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు .

కాగా పవన్ కళ్యాణ్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 1996లో రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది . పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు నెలకు 5000 చొప్పున మొత్తం 50000 ఈ సినిమా రెమ్యూనరేషన్ గా అందుకున్నారట.

ఆ దబ్బు మొత్తం అమ్మ చేతిలో పెట్టేశాడట పవన్. అంతేకాదు పవన్ రెమ్యూనరేషన్ తెలిసి చాలా మంది షాక్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పారితోషకం కేవలం 50,000 నే అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news