Moviesవిజ‌య్ ' లియో ' స్టోరీ ఇదే… లోకేష్ క‌న‌గ‌రాజ్ ట్విస్టులు...

విజ‌య్ ‘ లియో ‘ స్టోరీ ఇదే… లోకేష్ క‌న‌గ‌రాజ్ ట్విస్టులు చంపేశాడ్రా…!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న సినిమా లియో. విజ‌య్ ఈ సంక్రాంతికి తెలుగు డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వరీసు ( తెలుగులో వార‌సుడు ) సినిమాలో న‌టించాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా యావ‌రేజ్‌గా ఆడింది. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ లియో సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్‌లో సినిమాటిక్ యూనివ‌ర్స్ అనే కాన్సెఫ్ట్‌తో సినిమాలు తెర‌కెక్కిస్తూ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోన్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

లోకేష్ క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా తెర‌కెక్కించిన విక్ర‌మ్ సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో.. ఈ వ‌య‌స్సులోనూ క‌మ‌ల్‌కు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో చూశాం. దీంతో విక్ర‌మ్ త‌ర్వాత లోకేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. సెవెన్ స్క్రీన్ బ్యాన‌ర్ ప‌తాకంపై ఎస్.ఎస్. ల‌లిత్ కుమార్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో త్రిష‌.. విజ‌య్‌కు జోడీగా న‌టిస్తున్నారు. గ‌తంలో విజ‌య్‌, త్రిష కాంబినేష‌న్ అంటే బ్లాక్బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ అన్న టాక్ ఉండేది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్ రిపీట్ కావ‌డంతో ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం యావ‌త్ టాలీవుడ్ ఎంతో ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తోంది. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌, సీనియ‌ర్ హీరో అర్జున్, క‌దీర్‌, మ‌న్సూర్ ఆలీఖాన్‌, ద‌ర్శ‌కుడు మిస్కిన్‌, గౌత‌మ్ మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

చెన్నైలో గ‌త నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు లోకేష్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 19న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.
ఇక ఈ సినిమా స్టోరీ లైన్ కోలీవుడ్ మీడియా స‌ర్కిల్స్‌లో లీక్ అయ్యింది. ఈ సినిమాలో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్‌.. రెండోది పార్తీబ‌న్ అనే సాధార‌ణ యువ‌కుడి పాత్ర‌.

గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర పేరు లియో.. రెండోది పార్తీప‌న్ అనే చాక్లెట్లు త‌యారు చేసుకునే సాధార‌ణ యువ‌కుడి పాత్ర‌. అయితే సినిమాలో విజ‌య్ రెంటు గెట‌ప్పుల‌లో క‌నిపిస్తాడా ? లేదా డ్యూయ‌ల్ రోల్ ఉంటుందా ? అన్న‌ది తెలియ‌దు. కానీ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర చాలా హైలెట్‌గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది. లోకేష్ ట్విస్టులు అదిరిపోతాయ‌ని… సినిమా ఓ రేంజ్‌లో ఉండ‌బోతోంద‌న్న హైప్ కోలీవుడ్ సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news